నాలుగో సింహం రెడీ అవుతున్నాడు !

కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అని శాయి కుమార్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ నాలుగో సింహం అనే టైటిల్ తోనే ఒక సినిమా తెరకెక్కుతోంది. తెలుగులో మంచి పేరు సంపాదించిన స్టార్‌ కమెడియన్లలో షకలక శంకర్‌ ఒకరు. అతి తక్కువ కాలంలోనే కమెడియన్‌గా పేరు సంపాదించిన శంకర్‌ హీరోగా మారి, సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘నాలుగో సింహం’ చిత్రంలో ఆయనే హీరోగా నటిస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో జానీ నిర్మిస్తున్న ఈ నాలుగో సింహం సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. ముంబైకి చెందిన అక్షయ్‌ శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోన్న ఈ సినిమాలో మహిళలకు జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులువాటిని చూసి చూడనట్లుగా ఉండే అవనీతి అధికారుల నిర్వాకాల మీద హీరో పోరాడతాడు అట. ముద్దమందారం పూర్ణిమ, సత్యప్రకాష్‌, గుర్లిన్‌ చోప్రా, గబ్బర్‌ సింగ్‌ బ్యాచ్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.