సినిమా అయినా ఇంకా ప్రేమలోనే..!

Shalini Pandey Love With Arjun Reddy Hero Vijay Devarakonda

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్టర్‌ మూవీగా అర్జున్‌రెడ్డి నిలిచింది. విజయ్‌ దేవరకొండ హీరోగా షాలిని పాండే హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు 40 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంతటి ఘన విజయం సాధించడంతో ఈ చిత్ర హీరో, హీరోయిన్‌, దర్శకుడిపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. వీరికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే షాలిని పాండే రెండు మూడు తెలుగు సినిమాలతో పాటు ఒక తమిళ సినిమాకు కూడా ఓకే చెప్పేసింది.

ఇక అర్జున్‌ రెడ్డి సినిమాలో హీరో, హీరోయిన్‌ మద్య అంతగా కెమిస్ట్రీ వర్కౌట్‌ అవ్వడానికి కారణం నిజంగానే వారిద్దరు ప్రేమలో ఉన్నట్లుగా ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు. అదే విషయాన్ని షాలినితో లేదా విజయ్‌ని అడుగుతున్నారు. కాని వారిద్దరు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. తాము ప్రేమలో లేమని చెబుతున్నారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు మరియు ఇద్దరు మాట్లాడుతున్న మాటలు వారిద్దరి మద్య ప్రేమ ఉందని, సినిమా పూర్తి అయ్యి, విడుదలైన తర్వాత కూడా వారు ఇంకా ప్రేమలోనే కొనసాగుతున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా షాలిని మాట్లాడుతూ తనకు తెలుగులో అత్యంత ఇష్టమైన హీరో విజయ్‌ దేవరకొండ అని, ఆయనతో మళ్లీ మళ్లీ అర్జున్‌రెడ్డి వంటి సినిమాలు చేసేందుకు సిద్దం అంటూ ప్రకటించింది. అంటే మళ్లీ మళ్లీ విజయ్‌తో ముద్దులకు ఈ అమ్మడు సిద్దం అన్నమాట. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇద్దరి మద్య ప్రేమ ఉందని చెప్పకనే చెబుతున్నాయి.