టీజర్‌ టాక్‌ : 2 వేల కోట్లు రాబట్టే సత్త ఉన్న మూవీ…!

Shankar Robo 2 Movie Budget 550 Crores

రజినీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘రోబో’ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లోనే బాలీవుడ్‌ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లను ఆ చిత్రం రాబట్టింది. ఇప్పుడు ఆ సినిమా నేపథ్యంలోనే తెరకెక్కిన ‘2.0’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. దాదాపు మూడు సంవత్సరాలుగా దర్శకుడు శంకర్‌ ఈ చిత్రంను తెరకెక్కించేందుకు కష్టపడ్డాడు. ఇక గత సంవత్సర కాలంగా సినిమా గ్రాఫిక్స్‌ వర్క్‌ కోసం వేలాది మంది టెక్నీషియన్స్‌తో వర్క్‌ చేయిస్తున్నాడు. రికార్డు స్థాయి బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం టీజర్‌ను తాజాగా విడుదల చేయడం జరిగింది. టీజర్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

robo-2
శంకర్‌ ఈ చిత్రాన్ని దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోవడం ఖాయం అంటూ టీజర్‌ చూసిన తర్వాత అనిపిస్తుంది. ఇదో విజువల్‌ వండర్‌ అంటూ మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. అనుకున్నట్లుగానే ఇది ప్రేక్షకులను మరో లోకానికి తీసుకు వెళ్లి, అద్బుతం అనిపించేలా ఉంది. ఇక ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించడం ఖాయం అని, బాహుబలి సినిమా కలెక్షన్స్‌ను బీట్‌ చేయడంతో పాటు, అద్బుతమైన సరికొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. ‘2.0’ టార్గెట్‌ 2.5 వేల కోట్లు అంటూ సమాచారం అందుతుంది. ట్రేడ్‌ వర్గాల వారు మాత్రం ఈ చిత్రం రెండు వేల కోట్లను వసూళ్లు చేయగలదని నమ్ముతున్నారు. త్వరలో రాబోతున్న ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నటించగా, హీరోయిన్‌గా అమీ జాక్సన్‌ నటించింది. ఈ చిత్రం సోషల్‌ మీడియా వ్యూస్‌ 100 మిలియన్స్‌ను దాటినట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.

 

robo-movie