‘గేమ్ ఛేంజ‌ర్’ మూవీ పై శంక‌ర్ లేటెస్ట్ అప్డేట్…. ఏంటో తెలుసా ….!

Shankar's latest update on 'Game Changer' movie....
Shankar's latest update on 'Game Changer' movie....

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘గేమ్ ఛేంజ‌ర్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ను స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ సినిమా పై అంచ‌నాలు నెక్ట్స్ లెవెల్ లో ఏర్ప‌డ్డాయి. ఇక ఈ మూవీ పై తాజాగా డైరెక్ట‌ర్ శంక‌ర్ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న ‘భార‌తీయుడు-2’ చిత్ర యూనిట్ తాజాగా మీడియాతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఒక విలేకరి ‘గేమ్ ఛేంజ‌ర్’ రిలీజ్ పై ప్ర‌శ్నించ‌గా.. శంక‌ర్ దీనికి సమాధానం ఇచ్చారు. రామ్ చ‌ర‌ణ్ పోర్ష‌న్ కి సంబంధించిన షూటింగ్ ముగిసింద‌ని.. ఇంకో 10-15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంద‌ని.. అది పూర్త‌వ్వ‌గానే, ఎడిటింగ్ వ‌ర్క్ పూర్తి చేసుకుని మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

Shankar's latest update on 'Game Changer' movie....
Shankar’s latest update on ‘Game Changer’ movie….

ఇక ‘గేమ్ ఛేంజ‌ర్’ సినిమా లో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా ఈ మూవీ లో అంజ‌లి, శ్రీ‌కాంత్, ఎస్.జె.సూర్య త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ లు ప్రొడ్యూస్ చేస్తున్నారు.