టీ20ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ధర్మశాల వేదికగా శ్రీలంక జరిగిన మూడో టీ20లో ఆడిన రోహిత్.. తన అంతర్జాతీయ టీ20 కేరిర్‌లో 125 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. పాకిస్తాన్ తరపున 124 టీ20 మ్యాచ్‌లు ఆడి తొలి స్ధానంలో ఉన్న షోయాబ్ మాలిక్ రికార్డును రోహిత్ ఆధిగమించాడు. ఇక 124 మ్యాచ్‌లతో మాలిక్ రెండో స్ధానంలో ఉండగా, పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ 119 మ్యాచ్‌లుతో మూడో స్ధానంలో ఉన్నాడు. ఇక 100కు పైగా టీ20లు ఆడిన టీమిండియా ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడు శర్మ మాత్రమే.
రోహిత్ తరువాత 98 మ్యాచ్‌లతో భారత మాజీ కెప్టెన్ ఎంస్ ధోని ఉండగా, 97 మ్యాచ్‌లతో విరాట్ కోహ్లి రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ షనకా తప్ప మిగితా ఎవరూ రాణించలేదు. ఇక 147 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.5 ఓవర్లలోనే చేధించింది. టీమిండయా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మరో సారి చెలరేగి ఆడాడు. 45 బంతుల్లో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.