Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘మహానుభావుడు’ చిత్రం తర్వాత శర్వానంద్ చేసిన ‘పడి పడి లేచెను మనసు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా తర్వాత శర్వాతో చేస్తున్న సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్న చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు దక్కించుకున్న సుధీర్ వర్మ తాజాగా శర్వానంద్ కోసం ఒక మంచి స్క్రిప్ట్‌ను రెడీ చేయడం జరిగింది. ఆ స్క్రిప్ట్‌లో ఎక్కువ శాతం సీన్స్‌ను 1980 కాలం నేపథ్యంలో తెరకెక్కించాల్సి ఉంటుందని సమాచారం అందుతుంది.
తాజాగా వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం మొత్తం 1980 కాలం నేపథ్యంలో తెరకెక్కింది. ఒక సినిమా మొత్తంను ఆ కాలంలో చేయడం అంటే మామూలు విషయం కాదు. దర్శకుడు సుకుమార్ ఎంతో కష్టపడి, అద్బుతమైన సెట్టింగ్స్ వేయించి ప్రేక్షకులను అప్పటి కాలంకు తీసుకు వెళ్లాడు. తాజాగా సుధీర్ వర్మ కూడా అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకునేలా సెట్టింగ్స్ వేయించాడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఇక ఈ చిత్రంలో శర్వాలుక్ కూడా చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం అందుతుంది. శర్వానంద్, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రికార్డు తప్పకుండా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.