ఇది మరో ‘భలే భలే మగాడివోయ్‌’

Sharwanand's Mahanubhavudu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

శర్వానంద్‌ హీరోగా మెహ్రీన్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘మహానుభావుడు’ చిత్రం టీజర్‌ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో వంశీ మరియు ప్రమోద్‌ నిర్మించారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకోనుంది అంటూ ఈ టీజర్‌తో తేలిపోయింది. మారుతి గత చిత్రం ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రం భారీ బ్లాక్‌ బస్టర్‌ను దక్కించుకుంది. ఆ సినిమా మాదిరిగిగా ఈ చిత్రం కనిపిస్తుందనే టాక్‌ సోషల్‌ మీడియాలో వస్తుంది. ముఖ్యంగా కొన్ని సీన్స్‌ షాట్స్‌ అచ్చు ఆ సినిమాకు సంబంధించినవిగా ఉన్నట్లుగా ఉన్నాయి. 

తాజాగా నాని ‘మహానుభావుడు’ టీజర్‌పై స్పందిస్తు వీడు లక్కీ(భలే భలే మగాడివోయ్‌ చిత్రంలో హీరో) గాడికి కజిన్‌లా ఉన్నాడంటూ ట్వీట్‌ చేశాడు. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే పాత్రలో శర్వానంద్‌ కనిపించబోతున్నాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా మొదటి నుండి ప్రచారం చేస్తున్నారు. అన్నట్లుగానే దసరాకే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని టీజర్‌లో కూడా ప్రకటించారు. ఖచ్చితంగా ఈ సినిమా శర్వాకు కమర్షియల్‌ సక్సెస్‌ను ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఇప్పటికే ‘శతమానం భవతి’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న శర్వా ఈ సినిమాతో మరో సక్సెస్‌ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు.

మరిన్ని వార్తలు:

ఆ సెక్స్‌ రాకెట్‌తో ఇద్దరు సినీ ప్రముఖులకు సంబంధం!

చిన్నారుల‌కు ప్రేమ‌`తో నేర్పిద్దాం…కోపంతో కాదు

ఇది మరో ‘భలే భలే మగాడివోయ్‌’ - Telugu Bullet