బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. ప్రతి వారం ఒకొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో పదిమంది ఉన్నారు. ఈ వారం ఈ పదిమందిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లారు . ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది ఉన్నారు. శోభా శెట్టి, రతిక, అశ్విని, అమర్ దీప్, ప్రశాంత్, అర్జున్, గౌతమ్, ప్రియాంక నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లనున్నారన్నది ఆస్కతికరంగా మారిపోయింది . నేటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ లో ఉన్నవారికి సీరియస్ వర్నింగ్స్ తో పాటు ఆటపాటలతో బాగా సందడి చేస్తారు. అలాగే కొంతమందిని సేఫ్ కూడా చేస్తారు. ఇక ఈ సండే రోజు ఒకరిని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు వెళ్తారు.
ఈ వారం హౌస్ లో నామినేట్ అయినా వారిలో శోభా శెట్టి, అశ్విని, రతికా డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తుంది . ఈ ముగ్గురిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. ఈ ముగ్గురుకి ఓటింగ్స్ పోటీపోటీగా జరుగుతున్నాయి. అయితే ఎక్కువ శాతం ఓట్లు రతికకు పడుతున్నాయని తెలుస్తోంది. ఈవారం కూడా రతికా సేఫ్ కానుందని తెలుస్తోంది.
అలాగే అశ్విని, శోభా శెట్టి పోటీపడుతున్నారు. వీరిద్దరిలో శోభా శెట్టి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానుందని తెలుస్తుంది . శోభాశెట్టి ఎలిమినేట్ కావాలని ఆడియన్స్ అంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆమె సేఫ్ అవుతూ వస్తుంది. కానీ ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మరి నిజంగా ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందా లేక సేఫ్ అవుతుందా అనేది చూడాలి.