Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నికల్లో హైటెన్షన్ క్రియేట్ చేసిన నామినేషన్ల స్క్రుటినీ ముగిసింది. రెండు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. అంతకు ముందు రెండు గంటల పాటు హైడ్రామా నెలకొంది. ఎవరి నామినేషన్ చెల్లుతుంది, ఎవరిది చెల్లదు అని చర్చోపచర్చలు నడిచాయి.
మొదట టీడీపీ వైసీపీ అభ్యర్థి శిల్పా నామినేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నోటరీ లైసెన్స్ లేకుండానే సంతకాలు పెట్టించుకున్నారని మండిపడింది. దీనికి తగ్గట్లుగా నోటరీ రామతులసిరెడ్డి లైసెన్స్ 2013లోనే ముగిసిపోయిందని వార్తలొచ్చాయి. అయితే తాము రెన్యువల్ కు అప్లై చేశామని, రెన్యువల్ చేస్తే సంతకం పెట్టొచ్చని హైకోర్టు తీర్పు ఉందని రామతులసిరెడ్డి వివరణ ఇచ్చారు.
ఇటు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిపై నామినేషన్ చెల్లదని వైసీపీ ఫిర్యాదు చేసింది. ఐటీ రిటర్నలు దాఖలు చేయలేదని ఆరోపించింది. కానీ అఫిడవిట్ లో ఆస్తులు ఇస్తే చాలని టీడీపీ కౌంటరిచ్చింది. చివరకు రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని న్యాయనిపుణులు తేల్చడంతో.. చిన్న చిన్న లోపాలున్నా పర్లేదని ఇద్దరి నామినేషన్లకు ఆమోదముద్ర వేశారు.
మరిన్ని వార్తలు: