ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఈ విధంగా ప్రతి ఒక్కరు జెండా ఎగరవేస్తూ జెండాకు వందనం చేస్తూ ఎంతో సంతోషంగా ఈ వేడుకను జరుపుకున్నారు.ఇక సెలబ్రిటీలు సైతం జెండా ఎగురవేస్తూ ఈ వేడుకను జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ నటిశిల్పా శెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి జెండాను ఎగరవేశారు. అయితే ఈమె జెండా ఎగర వేసే సమయంలో కాళ్లకు చెప్పులు వేసుకోవడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది.శిల్పా శెట్టి తన కుటుంబ సభ్యులతొ కలిసి ఈ స్వతంత్ర దినోత్సవపు వేడుకలను జరుపుకున్నారు.
ఇందులో భాగంగా ఆమె జెండా ఎగరవేస్తూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వేదికంగా షేర్ చేయడంతో ఇది కాస్త వివేదానికి కారణమైంది.ఇలా జెండా ఎగర వేసే సమయంలో చెప్పులు వేసుకోవడం ఏంటి అంటూ ఆమె పట్ల టోల్స్ చేస్తున్నారు అయితే నెగటివ్ కామెంట్స్ పై స్పందించిన శిల్పా శెట్టి తన స్టైల్ లో సమాధానం చెప్పారు.
జెండా ఎగర వేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో నాకు అవగాహన ఉందని తెలిపారు.నా దేశం పట్ల, జెండా పట్ల ఉన్న గౌరవాన్ని మాత్రమే చూడండి ప్రశ్నించడం కాదు.నేను ఒక భారతీయురాలిగా గర్విస్తున్నాను.ఈరోజు సంబరాలు చేసుకోవడం ఓ భావోద్వేగం.నెగిటివిటీని స్ప్రెడ్ చేయడానికి కాదు.వాస్తవాలను తెలుసుకోండి.ఇలాంటివి ఆపివేయడంనీ పోస్ట్ పెట్టారు.
ఈ పోస్టుపై కొందరు శిల్పా శెట్టి కి మద్దతు తెలుపగా మరికొందరు మాత్రం కాల్ చేస్తున్నారు.చాలామంది ఆగస్టు 15వ తేదీ అంటే హాలిడే అనుకుని ఇండ్లలో నిద్రపోతున్నారు కనీసం జెండాకు వందనం కూడా చేయాలని కొందరికి తెలియదు అలాంటి వారితో పోలిస్తే మీరు చాలా గ్రేట్ ఇలాంటివి ఏవి పట్టించుకోకుండా హ్యాపీగా ఉండండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే మేడం అంటూ శిల్పా శెట్టికి మద్దతు తెలుపుతున్నారు