ప్రియాంకకి వార్నింగ్ ఇచ్చిన శివాజీ.. ఏమైందంటే..?

ప్రియాంకకి వార్నింగ్ ఇచ్చిన శివాజీ.. ఏమైందంటే..?
Latest News

ఉల్టా ఫుల్టా అంటూ బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవలే ప్రారంభమైన విషయం మనకి తెలిసిందే. మొదటి వారమే నామినేషన్స్ పెట్టగా అందులో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయారు . నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అంతా మార్పులు చేశామని హడావిడి చేశారు. అయితే ఎక్కడ కూడా ఆ మార్పులు కనిపించలేదు ఎప్పటిలాగే అవి రొటీన్ గానే కనిపిస్తూ ఉన్నాయి అంటూ అభిమానుల సైతం తమ అభిప్రాయాలను కూడా వ్యక్తపరుస్తున్నారు.

ప్రియాంకకి వార్నింగ్ ఇచ్చిన శివాజీ.. ఏమైందంటే..?
Priyanka

కొన్ని రూల్స్ మార్చినప్పటికీ కూడా బిగ్ బాస్ లో జరుగుతున్న విధానం మాత్రం ఏమాత్రం బాగా లేదని.. బోర్ కొట్టించే విధంగానే ఉందని చెబుతున్నారు. . అయితే అదే తరహా టాస్కులు ఒకరిపై ఒకరు చెప్పుకునే చాడీలతో బిగ్ బాస్ సెవెన్ అంతంత మాత్రమే సాగుతూ ఉంది . ఇక శివాజీ , తేజ లాంటి ఒకరిద్దరు మాత్రమే వినోదాన్ని అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా నామినేషన్ కి సంబంధించిన ప్రక్రియ మొదలైంది.. దీనికోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారిని షవర్ కిందికి పంపి బజర్ నొక్కితే షవర్ పడుతుంది.

ఆ తర్వాత ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణాలు చెప్పాలి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం కాస్త వేడెక్కింది. ఇక ప్రియాంక – శివాజీ మధ్య చిన్న మాటలు యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు . నేను ఒక పాయింట్ చెబుతుంటే మీరు దబాయించే విధంగా అడ్డుకుంటున్నారు అని ప్రియాంక శివాజీని ఆరోపించగా.. దీనికి శివాజీ బదిలీస్తూ నేనిక్కడ బిగ్ బాస్ మాట తప్ప ఎవడి మాట వినను అని చెప్పేసాదంట శివాజీ . ఇలా మాట్లాడొద్దని ప్రియాంక అంటే అంత లేదమ్మా అంటూ శివాజీ బాగా ఫైర్ అయ్యాడు. మొత్తానికి అయితే ఈరోజు ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగనుందని మనకి తెలుస్తోంది.