కేసీఆర్ కి షాక్ తప్పదా ?

Kcr Shock TRS Leaders Joined The Congress

ఫెడరల్ ఫ్రంట్ అంటూ దక్షినాది రాష్ట్రాల పర్యటనలు మొదలుపెట్టిన కేసీఆర్ కు మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి. కేరళలో ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన కేసీఆర్ కి అక్కడ సాదర స్వాగతం లభించింది. ఆ ఉత్సాహం అలా ఉండగానే ఆ పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఎదురైన పరిణామాలతో గులాబీ బాస్ కి ఎదురుదెబ్బ తప్పలేదు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరో రెండు దశల పోలింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో స్పీడ్ పెంచిన కేసీఆర్ రాష్ట్రాల బాట పట్టారు. సోమవారం నాడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ అయిన కూటమిపై నిశితంగా చర్చించారు. అయితే ఈనెల 13న కాంగ్రెస్‌తో కలసి పని చేస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కావాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాదు స్టాలిన్‌కు ఫోన్ భేటీ గురించి కేసీఆర్ ఇప్పటికే మాట్లాడారు. అయితే కేసీఆర్‌తో స్టాలిన్ సమావేశం జరగకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉండటంతో కేసీఆర్‌, స్టాలిన్‌ భేటీపై అనుమానమేనని తెలుస్తోంది. ఈనెల 13న కాకుండా త్వరలోనే స్టాలిన్‌-కేసీఆర్‌ల భేటీ జరుగుతుందని సమాచారం. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్‌తో సోమవారం జరిగిన భేటీలో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించామని అంతే తప్ప ప్రధాని అభ్యర్థిపై చర్చ జరగలేదలేదని కేరళ సీఎం పినరయి విజయన్‌ మీడియాకు వివరించారు. కేసీఆర్‌తో చాలా ప్రాముఖ్యతగల సమావేశం జరిగిందని అన్నారు. గతంలో బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ కు అక్కడా పెద్దగా సానుకూల ఫలితాలు రాలేదు. కేసీఆర్ ని కలిసిన బెంగాల్ సీఎం మమత తన దారిన తాను చంద్రబాబుతో కలిసి మోడీ వ్యతిరేక పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. కేసీఆర్ పెడతానంటున్న ఫెడరల్ ఫ్రంటు గురించి మమతా లైట్ తీసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దక్షిణాదిలో కీలకమైన డీఎంకే అధినేత స్టాలిన్ కూడా కేసీఆర్ ఫ్రంట్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని సమాచారం.