షాకింగ్ : పూరి గుడిసె ఇంటికి.. రూ. 41వెయ్యి.. కరెంట్..

ఆంధ్రప్రదేశ్ లో పెద్ద తప్పిదం జరిగిపోయింది. పెద్ద బంగళాకు రావాల్సిన బిల్లు తనకు రావడంతో బాధితురాలు లబోదిబోమంటోంది. కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకొనే తనకు ఇంత కరెంటు బిల్లు రావడం ఏంటని ఆవేదనకు లోనైంది. అసలే కరోనా మహమ్మారి టైం. ఈ సమయంలో అమలు చేస్తున్న లాక్ డౌన్ తో కరెంటు బిల్లుల కట్టలేని పరిస్థితియ.

అయితే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల కరెంట్ బిల్లులు ఎక్కువ మొత్తం రావడంతో అందరిలో ఆందోళన నెలకొంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని అధికారులు స్పష్టత ఇచ్చారు. విద్యుత్ వినియోగించిన దానికంటే ఒక్క యూనిట్‌కి కూడా ఎక్కువ బిల్లు వేయలేదని వెల్లడిస్తున్నారు. అయినా కానీ.. చిత్తూరు జిల్లాలో ఉంటున్న ఒక మహిళకు వచ్చిన కరెంటు బిల్లు ఆశ్చర్యానికి లోనుచేస్తుంది.

అదేమంటే.. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామంలో బీడీలు చేసుకుంటూ ఛాన్వి అనే మహిళ కుటుంబాన్ని పోషించుకుంటుంది. అయితే ఆమెకు ఒక్కసారిగా రూ.41 వేల కరెంటు బిల్లు రావడంతో షాక్ కు గురైంది. ఆ వచ్చిన బిల్లును చూసి మహిళ లబోదిబోమంటోంది. ఛాన్వి అనే మహిళ ఇంటికి రూ.41,149 కరెంటు బిల్లు రావడంతో భయపడిపోయింది. రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు, టీవీ ఉన్న ఇంటికి ఇంత పెద్ద మొత్తంలో కరెంటు బిల్లు రావడం ఏంటని వారు ఆశ్చర్యపోయింది.

పెద్ద బంగళాకు రావాల్సిన బిల్లు తనకు రావడంతో బాధితురాలు బోరుమంటుంది. కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకొనే తనకు ఇంత కరెంటు బిల్లు రావడం ఏంటని ఆవేదనను వ్యక్తం చేసింది. లాక్ డౌన్ కారణంగా రెండు నెల కరెంటు బిల్లు ఒకటే సారి రూ.41 వేలకు పైగా కరెంటు బిల్లు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అదేవిధంగా మరో రెండు చోట్ల కూడా ఇలాగే వచ్చింది. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సమీపంలోని ఓ గ్రామంలో పూరి గుడిసెలో ఉండే ఓ కుటుంబానికి రూ.17 వేలు, మరో కాలనీలో రేకుల షెడ్డులో ఉంటున్న కుటుంబానికి రూ.28 వేల బిల్లు వచ్చింది. దీంతో వారు తలలు పట్టుకున్నారు. ఎంతో కాలంగా వేసవిలో కూడా వందలోపే బిల్లులు వస్తున్నాయని ఇప్పడు ఇంతమొత్తం రావడంతో షాక్ కు గురౌతున్నారు. అయితే విద్యుత్తు అధికారులు మాత్రం మీటర్‌ రీడింగ్‌ సేకరణ, బిల్లుల తయారీలో ఎలాంటి లోపాలు లేవని, వినియోగించిన దానికే ఛార్జీలు వసూలు చేస్తున్నామని చెప్పడం మరో షాకింగ్ విషయంగా చెప్పవచ్చు.