యువతపై టిక్ టాక్ ముప్పు.. బానిసను చేసేస్తుంది..

ఈమధ్య యువత విపరీతంగా టిక్‌టాక్‌ మోజులో పడిపోయింది. అది కాస్తా యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. తాజాగా టిక్ టాక్ లో ఓ దుర్ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. టిక్‌టాక్‌ వీడియో చిత్రీకరిస్తూ ఒక యువకుడు కరెంట్‌ షాక్‌తో గాయపడ్డాడు. 22 ఏళ్ల యువకుడు కదులుతున్న గూడ్స్‌ రైలుపై నిలబడి టిక్‌టాక్‌ వీడియో షూట్ చేస్తుండగా.. హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తగిలాయి. ఈ ప్రమాదంలో యువకుడి శరీరం 20 శాతం వరకు కాలిపోయింది. కాగా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనలో అతడి ప్రాణానికి ప్రమాదం తప్పిందని తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే.. మైసూర్‌ నుంచి వస్తున్న గూడ్స్‌ రైలు సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరు మెజెస్టిక్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ సమయంలో నెమ్మదిగా నడుస్తున్న గూడ్స్‌ రైలుపై టిక్‌టాక్‌ వీడియో చేసేందుకు ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. వీడియో తీసుకునే సమయంలో హైటెన్షన్‌ విద్యుత్‌ వైరు తగలడంతో షాక్‌ తగిలి కిందపడిపోయాడు. ఇది గమనించిన రైల్వే అధికారులు ఆ యువకుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడినకి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. కాగా ఈ టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ యువత ప్రాణాలకు మీదకు తెచ్చుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వినకుండా యువత టిక్‌టాక్‌కు బానిసలుగా మారుతుండటం ఆందోళన కలిగించే అంసంగా చెప్పవచ్చు.