కోవిడ్-19 కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించేస్తుంది. దీంతో అన్ని దేశాలు దాదాపు లాక్ డౌన్ లో ఉన్నాయి. అయితే దేశంలో మొదటిసారి 21రోజులు ఆ తర్వాత 19రోజులు మే3వ తేదీ వరకు మోడీ లాడ్ డౌన్ విధించారు. అయితే ఈ సమయంలో ఆయా రాష్ట్రాలు ఈ నిబంధనలను తప్పకుండా పాటిస్తున్నాయి. అన్నీ కూడా కరోనా బాధితుల సంఖ్యను తగ్గించే కరోనాను అంతం చేసేందుకు సహకరిస్తున్నాయి.
అయితే ఈ సమయంలో కరోనా వైరస్(కోవిడ్-19) బాధితులకు పంజాబ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కరోనా లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన వారి ఖర్చును ప్రభుత్వం భరించదని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రులకి వెళ్తే.. అక్కడ ఎవరి ఖర్చులు వారే భరించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 256కు చేరింది. కేసులు తక్కువగా ఉండటంతో రాష్ట్రంలో దశలవారీగా మద్యం అమ్మకాలు జరిపేందుకు అనుమతినివ్వాలని కేంద్రాన్ని కోరారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. అంతే కాకుండా కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రానికి 3వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసేలా చొరవ తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో వివరించారు.