Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొత్త మలుపు తిరిగిన రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమ్న హత్యకేసులో విభ్రాంతికర విషయం వెలుగుచూసింది. పరీక్షలు, పేరెంట్స్ మీటింగ్ వాయిదా పడేలా చేసేందుకే 11వ తరగతి విద్యార్థి ప్రద్యుమ్నను హత్యచేసినట్టు సీబీఐ భావిస్తోంది. నిందితుడైన విద్యార్థి చదువులో వెనకపడ్డాడని, దీంతో పరీక్షలు వాయిదా పడాలని కోరుకున్నాడని సీబీఐ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో ఆ విద్యార్థే ప్రధాన నిందితుడని తెలిపారు. ఇప్పటికే ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకుని పలుమార్లు విచారించిన సీబీఐ అధికారులు, తదుపరి విచారణ కోసం జువైనల్ కస్టడీకి అప్పగించాలని కోరుతున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటిదాకా ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బస్సు కండక్టర్ అశోక్ కుమార్ కు ఇప్పుడే క్లీన్ చిట్ ఇవ్వలేమని అధికారులు చెప్పారు. అతడిపై వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ కొనసాగుతుందని తెలిపారు.