శృతి కెరీర్ కోసం ప్రేమని వాడుకుంటోందా?

shruti-hassan-using-her-love-for-new-movie-opportunities

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

“ ఎక్కడికెళ్లినా చుట్టూ మూగే జనం , తెరపై కనిపిస్తే ఈలలు, చప్పట్లు.”…ఇవన్నీ చూసినప్పుడు ఓ హీరో లేదా హీరోయిన్ కి అబ్బా ఏమి జీవితం అనిపిస్తుంది. ఇక మనసుకి నచ్చింది చేయాలి అనుకుంటే అదే జనం గుర్తుకు వచ్చి ఆగిపోతున్నప్పుడో , వేసే ప్రతి అడుగు, తీసేప్రతి అడుగుని కెమెరా కళ్ళు చూస్తున్నప్పుడో, చేసే ప్రతిపనికి మన జీవితంతో ఏ సంబంధం లేని వ్యక్తికి సమాధానం చెప్పాల్సివచ్చినప్పుడో కూడా అబ్బా ఏమి జీవితం అనిపిస్తుంది. ఇప్పుడు ప్రేమబంధంలో చిక్కుకున్న కమల్ కూతురు శృతి పరిస్థితి కూడా అలాగే వుంది.

Shruti-Hassan

కోర్సెల్ అనే ఓ విదేశీ యువకుడితో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయిన శృతి అతన్ని తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు పరిచయం చేయాలి అనుకుంది. అనుకున్నట్టే చెన్నైలో కమల్ కి , ముంబై లో సారికకు కోర్సెల్ ని పరిచయం చేసింది. ఇక్కడి కుటుంబ విలువలు , సంప్రదాయాలు కూడా పనిలోపనిగా కోర్సెల్ కి కూడా అర్ధం అయ్యేట్టు చేయగలిగింది. ఇదంతా చూస్తున్నప్పుడు కోర్సెల్ తో బంధాన్ని దృఢం చేసుకోడానికి ఆమె ముందస్తుగా ఓ ప్రణాళిక తో ముందుకు వెళుతోంది.మెడ మీద తల, తలలో గుజ్జు ఉన్నవాడికి ఎవరికైనా శృతి పొజిషన్, మూడ్ ఈజీ గా అర్ధం అవుతాయి. అయితే ఓ జర్నలిస్ట్ మహాశయుడు దీనిపై అల్లిన కధనం చూస్తే ఇంత వంకరగా కూడా ఆలోచిస్తారా జనం అనిపించకమానదు.

kamal-hassan-daughter-shrut

కొత్త వ్యక్తిని జీవితంలో కి ఆహ్వానించే పనిలో భావోద్వేగ ప్రయాణం చేస్తున్న శృతిలో ఆ జర్నలిస్ట్ కి కెరీర్ ఓరియెంటేషన్ కనిపించింది. సినిమా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకోడానికి ఇలా లవర్ తో తిరగడం ద్వారా ప్రచారం , ఆపై అవకాశాలు కోసమే ఆమె ఇలా చేస్తోందని ఓ ప్రముఖ వెబ్ సైట్ కధనం అల్లేసింది. సినిమా అవకాశాల కోసం ఏ యువతి అయినా తల్లితండ్రికి ప్రియుడిని పరిచయం చేస్తుందా ? పైగా శృతి లాంటి ఆధునిక అమ్మాయి ప్రేమని కెరీర్ కోసం వాడుకుంటుందా ? ఏమి చేస్తాం. మన మనసులో చెత్త అంతా ఎవరో ఒకరికి రుద్దేసి అల్పానందం పొందే ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం శృతి లాంటి వాళ్లకి ఇలాంటి ఇబ్బందులు తప్పవు.