సీరియస్ గా రోజా కామెడీ…

YSRCP MLA Roja comments on Chandrababu
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
       జబర్దస్త్ లో జోకులకు విరగబడి నవ్వినా,  పొలిటికల్ వేదికల మీద హీట్ పెంచే వాగ్బాణాలు విసిరినా రోజా స్టయిలే వేరు. జగన్, ప్రశాంత్ కిషోర్ వార్నింగ్ ల దెబ్బకు మొన్నామధ్య కొద్దికాలం మౌనవ్రతం పాటించి నగరి నియోజకవర్గానికే పరిమితం అయిన రోజా మళ్లీ కొంతకాలంగా యాక్టివ్ అయ్యారు. ఈసారి కాస్త సంయమనంతో మాట్లాడుతున్నారే అనుకునేంతలో బండ్ల గణేష్ తో టీవీ 9 ఎపిసోడ్ లో ఆమె నోటిదూకుడు ఇంకోసారి ప్రూవ్ అయ్యింది. అయినా రోజా నుంచి పొలిటికల్ డయాస్ మీద సాఫ్ట్ రోల్స్ ఊహించడం మన తప్పు కానీ ఆమెది కాదు. ఇంత రచ్చ రచ్చ అయిన ఎపిసోడ్ నుంచి బయటపడేందుకు రోజా తాజాగా కాస్త కామెడీ మాటలు కూడా చెబుతోంది. అయితే అది జబర్దస్త్ లో మాత్రం కాదు.
       
  రోజా  లేటెస్ట్ గా ఓ ప్రెస్ మీట్ లో టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. ప్రజాస్వామిక విలువలకు సీఎం చంద్రబాబు పాతర వేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంలో ఓ జర్నలిస్ట్ మిత్రుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే టీడీపీ ని దెబ్బ తీయడానికి వలసలు ప్రోత్సహించరా అని అడిగారు. దానికి సమాధానం ఇచ్చిన రోజా జగన్ సీఎం అయితే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపులు ఉండబోవని హామీ ఇచ్చారు. అంతకుముందు కూడా జగన్ ఎలాంటి అవినీతి చేయలేదని ఆయనపై కేసులన్నీ రాజకీయ కోణంలోవే అని కూడా రోజా ఓ పెద్ద ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. జగన్ తరపున రోజా చేస్తున్న కామెంట్స్ చూసి ఆమె సీరియస్ గా భలే కామెడీ చేస్తున్నారు అనుకుంటూ  విలేకరులు నవ్వుకోవడం రోజా గమనించలేదేమో గానీ ఆమె అసిస్టెంట్స్ బాగానే చూస్తున్నారు. ఈ విషయం తరువాత అయినా ఆమె చెవిలో వేస్తే ఈసారి ప్రెస్ మీట్ లో అయినా జగన్ గురించి ఏమి చెబితే జనం అంతకన్నా ముందు విలేకరులు నమ్ముతారో కాస్త కసరత్తు చేసి వస్తారు పాపం.