హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ హిందూత్వవాదులు డిమాండ్ చేస్తున్నారు. శ్వేతా తివారీ తాజాగా నటించిన వెబ్ సిరీస్ షో స్టాపర్. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె సహనటుడు రోహిత్ రాయ్‌తో కలిసి భోపాల్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా శ్వేత భగవంతుడిపై జోక్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ నెటిజన్లు నటిని దుమ్మెత్తిపోశారు. భోపాల్‌లోని శ్యామల హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు కూడా నమోదైంది. ఈ విషయంపై మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. ‘శ్వేతా తివారీ నుంచి ఆ మాటలు రావడం నేనే స్వయంగా విన్నాను. ఇది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. దీనిపై విచారణ జరపాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించాను. ఆ తర్వాత నటిపై చర్యలు తీసుకోనున్నారు’ అని పేర్కొన్నారు.