తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2లో ఎలిమినేషన్ పక్రియ ప్రేక్షకులు వేస్తున్న ఓట్ల ద్వారా కాకుండా నిర్వాహకుల సొంత అభిప్రాయాల ఆధారంగా జరుగుతుందని సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా నూతన్ నాయుడు ఎలిమినేషన్ విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. కౌశల్‌ఆర్మీ భారీ ఎత్తున నూతన్ నాయుడుకు మద్దతుగా నిలిచారు. అలాంటి నేపథ్యంలో అమిత్ కంటే నూతన్ నాయుడు చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినా కూడా నూతన్ నాయుడు రీ రీ ఎంట్రీ అనే కారణంతో ఆయన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. తాజాగా నూతన్ నాయుడు మాదిరిగానే శ్యామల ఎలిమినేషన్ జరిగిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
బుల్లి తెరపై యాంకర్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న శ్యామలకు ప్రేక్షకుల నుండి మంచి మద్దతు ఉంది. ఎలిమినేషన్‌కు నామినేట్ అయినప్పటి నుండి కూడా శ్యామలకు ఆమె అభిమానులు బాగానే ఓట్లు వేస్తూ వచ్చారు. కాని ఆమె రీ ఎంట్రీ ఇచ్చిందనే కారణంగా అమిత్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా ఎలిమినేట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు. శ్యామల ఎలిమినేషన్‌తో మరోసారి తెలుగు బిగ్‌బాస్‌లో ఫెయిర్ గేమ్ సాగడం లేదు అంటూ నిరూపితం అయ్యింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున బిగ్‌బాస్ పై వస్తున్న విమర్శలతో నిర్వాహకులు తల పట్టుకున్నారు. మరో రెండు వారాల్లో పూర్తి కాబోతున్న ఈ షోలో ఫైనల్ విజేత ఎవరు అనే ఆసక్తి అస్సలు లేదు. ఎందుకంటే ఇప్పటికే కౌశల్ విజేత అంటూ తేలిపోయింది.