మరో వివాదంలో  సిద్ధారామయ్య

మరో వివాదంలో  సిద్ధారామయ్య
వివాదాలకు కేరాఫ్‌ కర్నాటక మాజీ సీఎం సిద్ధారామయ్య. ఏది చేసినా కాంట్రవర్సే. ఎన్ని వివాదాలు జరిగినా… ఆయన తీరులో మాత్రం మార్పు రాలేదు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య రెచ్చిపోయాడు. తన అనుచరుడిపై బహిరంగంగా చేయి చేసుకున్నాడు. సిద్ధరామయ్య తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. డీకే శివకుమార్‌ అరెస్టుపై ప్రెస్‌మీట్ పెట్టిన సిద్ధరామయ్య… మీడియా ముందే తన అనుచరుడిపై చేయి చేసుకున్నారు.
అందరి ముందు చెంప చెళ్లుమనిపించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలోనూ సిద్ధరామయ్య తీరు వివాదాస్పదమైంది. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో.. ఓ మహిళ ఆయనకు ముద్దివ్వడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటనపై ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు తన కాన్వాయ్‌లోని కారుపై కాకి వాలిందని.. ఏకంగా కారునే మార్చేశాడు సిద్ధరామయ్య.