ముఖ్యంగా రోజు జిమ్ చేసే వాళ్ళు ఉడికించిన గుడ్లను తీసుకుంటారు. అయితే ఇది మంచిది అని అనుకుంటారు. కానీ దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలా మందికి తెలియవు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.తాజాగా చేసిన స్టడీ ప్రకారం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం ఉడికించిన గుడ్లు, లీన్ మీట్ (చేప, స్కిన్ లెస్ చికెన్), స్టార్చ్ లేని కూరగాయలు (ఆకుకూరలు, బ్రోకలీ, క్యాప్సికం, క్యారెట్లు), పండ్లు (పుచ్చకాయలు , బెర్రీస్, ద్రాక్ష పళ్ళు, నిమ్మ కాయలు) కొవ్వు తక్కువ ఉండే పదార్థాలు (కొబ్బరి నూనె , బటర్, మయోనీస్) వంటివి గుడ్లకి బదులుగా తీసుకుంటే మంచిది అని తేలింది.
న్యూయార్క్ సిటీ బేస్డ్ డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ రెండు గుడ్లని పండ్లతో పాటు కలిపి బ్రేక్ ఫాస్ట్ సమయం లో తీసుకోవడం.. అదే విధంగా గుడ్లు లేదా లీన్ ప్రోటీన్‌ని లంచ్ లేదా డిన్నర్ సమయంలో తీసుకోవడం మంచిదన్నారు.అయితే తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం మంచిదని.. దీని వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది అని.. అయితే దీని వలన కేవలం సమతుల్యమైన పోషకపదార్థాలు మాత్రమే కాకుండా ఈజీగా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది అని తెలిసింది. అదే విధంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాసెస్డ్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ఇది ఇలా ఉంటే బంగాళాదుంపలు, మొక్కజొన్న వంటి వాటికి కూడా దూరంగా ఉంటే మంచిది.
అదే విధంగా కొన్ని పండ్లు కూడా తినొద్దు అని అంటున్నారు. ఇక అవి ఏమిటంటే అనేది చూస్తే.. అరటి పండ్లు, పైనాపిల్, మామిడి, డ్రై ఫ్రూట్స్, మొక్క జొన్న, బఠాణి వంటివి తినడం వలన మంచిది కాదు అని వీటిని తింటే బరువు తగ్గడానికి అవ్వదు అని తేలింది. తాజాగా చేసిన స్టడీ ప్రకారం తృణధాన్యాలు తింటే ఆరోగ్యానికి మంచిది అని.. కార్డియో వాస్క్యులర్ హెల్త్ కి మరియు బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది అని తెలుస్తోంది. అయితే ఉడికించిన గుడ్లు రెండు తీసుకుంటే పరవా లేదు కానీ రోజులో రెండు కంటే ఎక్కువ గుడ్లు తీసుకోవడం మంచిది కాదు అని తెలుస్తోంది.
అదే విధంగా గుడ్ల లో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే సాచురేటెడ్ ఫ్యాట్ కూడా దీనిలో ఉంటుంది అని తెలుస్తోంది. ఇది లివర్ మరియు హృదయ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. తాజా రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే… రోజూ గుడ్లు తినే వాళ్ళలో 20 శాతం కార్డియో వాస్క్యూలర్ సమస్యలు ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ కనుక మీరు రోజుకి రెండు గుడ్లు తిన్న లేదా వారానికి రెండు మూడు సార్లు తిన్న కూడా ఏ ఇబ్బంది లేదు. దానికి మించి తింటే కచ్చితంగా ఈ సమస్యలు వస్తాయని ఈ స్టడీ ప్రకారం తెలుస్తోంది. కాబట్టి ఎక్కువ గుడ్లు తినే వాళ్ళు అన్ని ఎక్కువ తినకుండా చూసుకోవడం మంచిది. లేదు అంటే స్టడీ ప్రకారం తెలిసిన సమస్యలు మీకు కూడా తప్పవని తెలుసుకోండి.