సిల్లీ ఫెలోస్ రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్

SELLI-FELLOWS-review

నటీనటులు : సునీల్, అల్లరి నరేష్, పూర్ణ , చిత్రశుక్ల, జయ ప్రకాష్ రెడ్డి, పోసాని, బ్రహ్మానందం తదితరులు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : భీమనేని శ్రీనివాసరావు
నిర్మాతలు : కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
సంగీతం : శ్రీ వసంత్
సినిమాటోగ్రఫర్ : అనీష్ తరుణ్ కుమార్
ఎడిటర్ : గౌతమ్ రాజు

selli-fellos movie

సునీల్ అంటే నవ్వు, నవ్వు అంటే అల్లరి నరేష్. ఈ నవ్వించే కామెడీ కింగ్స్ సిల్లీ ఫెలోస్ లా మన ముందుకి వచ్చేసారు. రీమేక్స్ మీద మంచి పట్టున్న భీమనేని శ్రీనివాసరావు ఈ సినిమాకి దర్శకులు మరియు ఈ సారి కూడా ‘వెలైను వందుట వెలైకరన్’ అనే ఒక తమిళ్ సినిమా రీమేక్ తో వస్తున్నారు. అయితే, కుటుంబ కథా చిత్రాలతో పేరు గాంచిన శ్రీనివాస్ గారూ కామెడీని దట్టించడంలో కూడా సిద్దహస్తులే. దానికి, ప్రత్యక్ష సాక్ష్యం నరేష్ తో తీసిన సుడిగాడు. ఆ సినిమా ఏ రేంజ్ లో ఆడిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ సినిమా సినిమా తరువాత అటు నరేష్ కి, ఇటు శ్రీనివాస్ కి సరైన హిట్స్ లేకుండా పోయాయి.

SELLI-FELLOWS naresh sunil

మరో వైపు, సునీల్ గత రెండు ఏళ్ళుగా హీరోగా హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటువంటి తరుణంలో ఈ ముగ్గురు కలిసి సినిమా తియ్యాలనుకోవడం చాలా మంచి విషయం. ఒకవేళ సినిమా హిట్ అయితే ఒకటే దెబ్బకు మూడు పిట్టల్లా, ఒకటే సినిమాతో ముగ్గురికి హిట్ వచ్చి పడుతుంది. అయితే, ఈ కామెడీ త్రయం ఈ రోజు తీసుకొచ్చిన సిల్లీ ఫెలోస్ ఎలా ఆకర్షించిందో మాట్లాడుకుందాం.

కథ:

sunil  in Silly Fellows Movie Release

జాకెట్ జానకి రామ్ జాకెట్లు కుట్టుకునే స్థాయి నుండి ఎం.ఎల్.ఎ స్థాయికి ఎదుగుతాడు. అలాగే, వీర బాబు(అల్లరి నరేష్), సూరి బాబు(సునీల్) జానకి రామ్ కి కుడి భుజం, ఎడం భుజం లాంటి వాళ్ళు. అయితే, ఒక సారి జానకి రామ్ సాముహిక వివాహాలు జరిపిస్తున్న క్రమంలో ఒక జంట తక్కువవుతుంది. అయితే, జానకి రామ్ పరువు కాపాడడానికి, వీర బాబు సూరి బాబు కి పుష్ప(నందిని రాయ్) అనే రికార్డింగ్ డాన్సర్ తో పెళ్లి చేస్తాడు. దీంతో, సునీల్ ని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి(పూర్ణ) కి విషయం తెలిసి సునీల్ ని పొమ్మంటుంది కాని పుష్ప తో ఏ సంబంధం లేదని నిరూపిస్తే పెళ్లి చేసుకుంటా అని షరతు పెడుతుంది. అదలా ఉంటే, వీర బాబు ప్రేమించిన వాసంతి పోలీస్ అవ్వాలనే కళతో ఉంటుంది. దానికి, తను వీర బాబు కి 10 లక్షలు ఇస్తుంది, అవి వీర బాబు జానకి రామ్ కి ఇస్తాడు. అయితే, అనుకోకుండా జానకి రామ్ ఒక యాక్సిడెంటు వల్ల కోమాలోకి వెళ్ళిపోతాడు. దీంతో, 10 లక్షల సంగతి మర్చిపోవడం, వాసంతి తిరిగి 10 లక్షలు తిరిగి ఇమ్మని అడగడం ఇవన్ని కథను పరిగేట్టిచే అంశాలే. మధ్యలో, భూతం(పోసాని కృష్ణ మురళి) జానకి రామ్అ కోమాలో నుండి ఎప్పుడు బయటకు వస్తాడ అని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే, పుష్ప ని పెళ్లి చేసుకున్న సూరి బాబు గతి ఏంటి? తనకు నచ్చిన అమ్మాయిని అసలు పెళ్లి చేసుకుంటాడా లేక పుష్ప తో ఉండిపోతాడా? వీర బాబు వాసంతి కథ ఏం అవుతుది? అసలు, భూతానికి జానకి రామ్ తో పనేంటి? చివరికి, జానకి రామ్ కోమలో నుండి బయటకు ఎలా వస్తాడు, ఏం జరుగుతుంది? ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

naresh sunil movie

తమిళ్ రీమేక్ అయినా మన తెలుగు తెరకి సరిపడే అంశాలతోనే తెరకెక్కించారు భీమనేని శ్రీనివాసరావు. సినిమా కామెడీ తో బాగానే నడిచినా, కొంత లాజిక్ లెస్ తనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అది కొంచెం సినిమా ఫలితం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ, సినిమా రిలీజ్ కి ముందే ఆయన “దీంట్లో లాజిక్కులు వెతకొద్దు, హాస్యాన్ని ఒకటే ఆస్వాదించండి” అని చెప్పారు. అంతేలే, సుడిగాడు సినిమాలో వెతికినా దొరకదు ఒక్క లాజిక్ కూడా. అలా తీసినా హిట్ పడింది కదా…! మామూలుగానే, హాస్యచిత్రాల్లో లాజిక్ లేకుండా, అబ్ నార్మల్ గా తీస్తేనే కామెడీ పండుతుందన్న విషయం ఇప్పటి వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ, ఇందులో మరీ ఆశించినంత కామెడీ దొరకలేదు అన్నది కొంత వాదన అయితే అంచాలతో కాకుండా మాములుగా వెళ్తే సరైన, సరసమైన హాస్యాన్నే అనుభవించవచ్చు. పాత రోజుల్లో, జంధ్యాల గారూ, ఇప్పట్లో త్రివిక్రమ్ లాంటి వాళ్ళు ఎక్కడికో వెళ్లి కామెడీ వెతుక్కోకుండా చుట్టూ ఉన్న వాటితోనే కడుపుబ్బా నవ్వించే కామెడీని అందించారు. అయితే, పోల్చి చూడడం సబబు కాకపోయినా, వాటితో పోల్చి చూసి వాళ్లకి ఇది లాజిక్ లెస్ కామెడీ సినిమా అని అనిపిస్తుంది. ఆల్రెడీ తమిళ్ లో హిట్ సినిమా, ఇక్కడ కూడా హిట్ అవుతుందనే నమ్మకం తోనే ఇక్కడ చేసినా లాజిక్ లకి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న మన వాళ్ళు అంత తొందర సర్దుకుపోలేరు. కానీ, మాకు ఈ లాజిక్ లు ఎందుకు, హాయిగా సినిమాకు వచ్చి నవ్వుకుపోతాం అనుకునే వాళ్ళకి ఇది పక్కా సినిమా. ఇక ఫస్ట్ హాఫ్ అంతా అలా చల్లగా వెళ్ళిపోతుంది, కానీ, సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, ఇక చివర్లో చాలా వాటిలో చూసినట్టే అందరూ ఒకే చోట చేరి అజ్జి బాబోయ్ అనే రేంజ్ లో కామెడీ ట్రాక్ వేశారు దర్శకులు భీమనేని శ్రీనివాసరావు.

allari naresh new movie

ఇక నటన పరంగా వస్తే, హాస్య విభాగం లో రాజేంద్ర ప్రసాద్ గారు థీసిస్ రాసే స్థాయిలో ఉంటే, ఆయన తరువాత జనరేషన్ లో వచ్చిన అల్లరి నరేష్, సునీల్ గ్రాడ్యుయేట్ చేసేసారు. ఇలాంటి వాళ్ళను మామూలుగా ఒకరి కామెడీ చూస్తేనే నవ్వు ఆపుకోలెం అలాంటిది ఇద్దరూ, అది కూడా హీరోలుగా కనిపిస్తే… ఇంకే కామెడీ పండగే. చాలా ఏళ్ళ తరువాత పాత గెటప్ లోకి వచ్చేసిన సునీల్ గురించే ముందుగా మాట్లాడుకోవాలి. హీరో అయ్యిన తరువాత బాడీలో మార్పులు వచ్చేయేమో గానీ, కామెడీ టైమింగ్ లో మాత్రం అస్సలు మార్పు లేదు, అదే జోష్ మళ్ళీ చూపించారు. ఇక ఎప్పటి నుండో హిట్ కోసం పరితపిస్తున్న తరుణంలో సునీల్ అండ దొరికేసరికి అల్లరోడు రెచ్చిపోయారు అంతే. మళ్ళీ కొత్త ఊపుతో వచ్చినట్టు అనిపించింది స్క్రీన్ మీద అల్లరి నరేష్ ని చూస్తుంటే. మరో వైపు, చిత్ర శుక్ల తన వంతు తాను బాగానే చేసింది, పూర్ణ అండ్ నందినీల నిడివి తక్కువే అయిన ఉన్న వరకు గుడ్. ఇక మిగిలిన వాళ్ళంతా, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, రఘు అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

selli-fellows telugu movie
సాంకేతిక విభాగం అయితే, పేపర్ మీద ఉన్న కథ స్క్రీన్ మీదకు ఇంకా గొప్పగా తెచ్చి ఉంటే బావుండు అనిపించింది. సినిమా నిర్మాణ విలువల్లో డోకా లేదు. శ్రీ వసంత సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా బావున్నాయ్.చివరగా, లాజిక్ లేదనే లాజికల్ ప్రశ్న పక్కన పెడితే, సరదాగా సకుటుంబ సపరివారంగా వెళ్లి నవ్వుకోవచ్చు. ఫ్రెండ్స్ తో కలిసి అలా వెళ్లి ఇలా ఎంజాయ్ అన్నట్టు వాళ్ళకి సినిమా ఓకే అనుకోవచ్చు. సునీల్, అల్లరి నరేష్ కాంబో ని చూడడానికి వెళ్ళే వాళ్ళు సంతృప్తిగా బయటకి వస్తారు.

sunil and naresh movie

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ – సిల్లీ ఫెలోస్…  సిల్లీ లాజిక్కులు మిస్ అయ్యింది…

తెలుగు బుల్లెట్ రేటింగ్ – 1.5/5