తన మధుర గానంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ సునీతకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే ఆమె త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతోందనేదే ఆ వార్త సారాంశం. సినీ గాయనిగా జీవితం ప్రారంభించిన అనతి కాలంలోనే 19 ఏళ్ల వయసులో కిరణ్ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, వ్యక్తిగత కారణాలతో కొన్నాళ్ల క్రితం భర్త నుంచి ఆమె విడిపోయింది. వారిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు.
అయితే తనకు కాకపోయినా తన పిల్లకోసమయినా ఆమె మరో సారి వివాహం చేసుకునే ఆలోచన చేస్తున్నారట. ఎందుకంటే ఆమె గతంలో కొన్ని ఇంటర్వ్త్యూలలో తనకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పింది, అలాంటిది మళ్లీ ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె కాబోయే భర్త హైదరబాద్ లో ఒక ఐటీ కంపెనీ నడుపుతున్నాడని ఇటీవలే తన నానమ్మ మరణించడంతో కొద్ది రోజులు పెళ్లి విషయం వాయిదా వేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. నిజానిజాలు తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.