పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గని పై కప్పు కూలడంతో రాళ్ళ కింద ఆరుగురు కార్మికులు చిక్కుకుపోయారు. వీరిలో నలుగురు మృతిచెందారు.
మృతుల్లో అసిస్టెంట్ మేనేజర్‌తోపాటు ముగ్గురు కార్మికులు ఉన్నారు. మీస వీరయ్య అనే వ్యక్తికి తీవ్రమైన గాయాలవ్వగా గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. మరొకరి పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. సహాయక చర్యలు చేపట్టింది.