Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Sireesh Husband About Murder Case
శిరీష మరణం తర్వాత తెలుగు మీడియా ని చూస్తే జుగుప్స కలిగింది. అయ్యో పాపం ఓ ఆడకూతురు చనిపోయిందన్న బాధ కన్నా ఆమె ఎలాంటిదో చెప్పడానికే మీడియా ప్రాధాన్యం ఇచ్చింది. ఆమె క్యారెక్టర్ ని పూర్తిగా పతనం చేసేలా రాతలు రాశారు. ఇక ఎవరు విడుదల చేశారో తెలియని రెండు ఫోన్ సంభాషణల్ని పట్టుకుని శిరీష మంచిది కాదని చెప్పడానికి తెగ ప్రయత్నం చేశారు . శిరీష మీద మీడియాలో వచ్చిన వార్తలు నిజమో, కాదో చర్చించే వాళ్లంతా ఆమె చనిపోయినా ఆ కుటుంబంలో మిగిలిన వాళ్ళు ఈ మాటలతో ఎంత బాధపడతారో ఒక్కసారి కూడా ఆలోచించారో,లేదో?. శిరీష భర్త, కుమార్తె పరిస్థితి ఎలా ఉంటుందో ఇటు మీడియా కానీ అటు నోరు పారేసుకునే వాళ్ళు గానీ పెద్దగా పట్టించుకోకుండా తమ నోటి దూల తీర్చేసుకున్నారు.
నిజానికి ఈ పరిస్థితి ఎవరికి వచ్చినా తప్పొప్పులతో సంబంధం లేకుండా సిగ్గుతో, అపరాధ భావంతో కుంగిపోయేవాళ్లు. కానీ అందరూ ఒకెత్తు.శిరీష భర్త ఇంకొక ఎత్తు అనిపించాడు సతీష్ చంద్ర. భార్య మరణం కన్నా ఆమె గురించి ప్రపంచం చెప్పుకుంటున్న మాటలే ఈటెల్లా తగులుతున్నప్పటికీ ఆయన తలవంచలేదు. సగటు భారతీయ భర్తల్లా భార్యని ఆడిపోసుకోలేదు. సూటిపోటి మాటలు అనే వారి నుంచి పారిపోను లేదు. ఓ భర్తగా శిరీష మరణం అనంతరం ఏమి చేయాలో అన్నీ చేశారు. అంతే కాదు ఆ తర్వాత హైదరాబాద్ లో మీడియా ముందుకు వచ్చి శిరీష తో తాను సంతోషంగా బతికినట్టు చెప్పుకొచ్చారు. ఆమె 40 వేలు, తాను 20 వేలు సంపాదిస్తున్నా ఏ మాత్రం ఆత్మన్యూనతా భావం లేదన్నారు. ఇక శిరీష వ్యక్త్తిత్వాన్ని శంకించే పని పక్కనబెట్టి జరిగిన క్రైమ్ గురించి ఆలోచించాలని పోలీసులకు, మీడియాకు చెప్పాడు సతీష్ చంద్ర. ఇప్పుడు సతీష్ చంద్ర ఇలా మాట్లాడడాన్ని కూడా చేతకానితంగా చూసే వాళ్ళు కొందరు వున్నారు. తెగ చదివి, తెగ సంపాదించి భార్యని అనుమానించడమో, అగౌవరరచడమో జన్మ హక్కుగా భావించే ఎందరితోనో పోల్చుకుంటే సతీష్ చంద్ర సమున్నత శిఖరం. ఆయనకి పెద్ద చదువు లేకపోవచ్చు. కానీ భార్యని ఓ సాటి మనిషిగా గుర్తించి గౌరవించే సంస్కారం వుంది. దీంతో భార్యాభర్తల బంధం అంటే ఎలా ఉండాలో చెప్పిన సతీష్ చంద్ర నిజమైన మగాడు…మొగుడు.