బీహార్లో పారిన కమలం పాచిక

Operation Bihar started with the BJP party leaders

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Operation Bihar Started with The BJP Party Leaders

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే బీహార్లో ఎన్డీఏకు షాక్ తగిలింది. ఎవ్వరూ ఊహించని విధంగా బద్ధశత్రువులైన నితీష్, లాలూ కలిసి మహాకూటమిగా ఏర్పడి ఘన విజయం సాధఇంచారు. అంతే అప్పట్నుంచి కమలనాథులు ఆపరేషన్ బీహార్ మొదలెట్టారు. వ్యూహాత్మకంగా లాలూపై అవినీతి కేసులు తిరగదోడి.. ఆయనపై అవినీతిపరుడిగా పదేపదే ముద్ర వేసి… నితీష్ ను డిఫెన్స్ పెట్టారు. పైగా కావాలంటే మేం మద్దతిస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.

అంతటితో ఆగారా అంటే అదీ లేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఏరికోరి బీహార్ గవర్నర్ నే ఎంపిక చేసి.. నితీష్ కు స్వీట్ షాక్ ఇచ్చారు. దీంతో ఆయన కూడా గత్యంతరం లేక కోవింద్ కు మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. దీనికి తోడు సోనియా కూడా మీరాకుమార్ ను దించి నితీష్ ను ఇరుకునపెట్టారు. అయినా సరే చేవలేని కాంగ్రెస్ కంటే.. పవర్లో ఉన్న బీజేపీ బెటరని ఫిక్సయ్యారు నితీష్.

ఇక ఆర్జేడీ, జేడీయూ కూటమి పొత్తుకు బీటలు వారడం మొదలైంది. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఆర్టేజీ భారీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీనికి నితీష్ హాజరు కావడం లేదు. కానీ లాలూ ఆహ్వానిస్తే చూద్దామని అంటున్నారట. ఇక్కడ ఇగో ప్రాబ్లమ్ తలెత్తడం ఖాయం. లాలూతో పోలిస్తే నితీష్ అన్ని విధాలా జూనియర్. జూనియర్ కు ఇంకెంత కాలం అణిగుండాలనే బాథ కూడా లాలూకు ఉంది. వీరి మనస్పర్థలే నితీష్ ను బీజేపీకి దగ్గర చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు:

మగాడు,మొగుడు అనిపించాడు.

చెంప చెళ్లుమనిపించిన రవితేజ.