టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన గారాలపట్టి సితారకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు మహేశ్ కూతురు సితార 8వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మహేశ్ అభిమానులు సీతు పాపకు బర్త్‌డే విషెష్ తెలుపుతున్నారు. సితార బర్త్‌డే సందర్భంగా మహేశ్ ఒక ప్రత్యేకమైన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘చాలా తొందరగా సితార ఎనిమిదో వసంతంలోకి అడుగుపెట్టింది. నేను నీకు(సీతు పాప) తెలియనంతగా ప్రేమిస్తున్నాను. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ మహేశ్ కామెంట్ జతచేశారు. మహేశ్ పోస్ట్ చేసిన ప్రత్యేమైన వీడియోలో.. సితార చిన్ననాటి ఫొటోలు, సితారతో మహేశ్ గడిపిన సరదా క్షణాలకు సంబంధించినవి ఫొటోలు ఉన్నాయి.
అదే విధంగా నమ్రతా శిరోద్కర్ సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో బర్త్‌డే విషెష్ తెలిపారు. సీతు పాపతో కలిసి దిగిన ఫొటోలతో కూడిన ఓ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఎనిమిదేళ్ల క్రితం మీరు ఈ ప్రపంచంలోకి వచ్చారు. నాకు మరిత ఆనందాన్ని, ప్రేమను పంచారు. మా జీవితంలో చాలా ఆనందాన్ని నింపినందుకు ధన్యవాదాలు. మీ చిరునవ్వు నాలోని వెలుగును ఎప్పటీకీ దూరం చేయదు. నాకు మీరు చాలా ఉత్తమైనవారు. మీరు దయ, ప్రేమ గల అమ్మాయిగా పెరుగుతున్నారు. మీకు తల్లిగా నేను చాలా గర్వపడుతున్నాను! నా చిట్టి స్టార్.. ఐ లవ్ యూ. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని నమ్రత కామెంట్ జత చేశారు.
ఇక కరోనా వైరస్ కారణంగా మహేశ్‌బాబు తన సతీమణి నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో సమయానన్ని గడుపుతున్నారు. తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని మహేశ్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘గీతగోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తీ సురేష్ కన్ఫార్మ్ అయ్యారు.