Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమాలపై అభిరుచితో వ్యాపారాలను వదిలేసి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించిన శివబాలాజీ ఇటీవల తెలుగు బిగ్‌బాస్ సీజన్ 1 విజేతగా నిలిచిన విషయం తెల్సిందే. బిగ్‌బాస్‌తో భారీ క్రేజ్‌ను దక్కించుకున్న శివబాలాజీ ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ‘స్నేహమేరా’ జీవితాన్ని చేశాడు. ఆ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు, నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకున్నాడు. దాదాపు ఆరు కోట్ల మేరకు శివబాలాజీ పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది. సినిమా చెత్తగా ఉంది అంటూ టాక్ వచ్చింది. దాంతో చిత్రాన్ని ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. మొదటి రెండు మూడు రోజుల్లోనే సగంకు పైగా థియేటర్‌లు తొలగించారు.
సినిమా బడ్జెట్ మరియు ప్రమోషన్ ఖర్చు అన్ని కలుపుకుంటే దాదాపుగా ఆరు కోట్లను శివబాలాజీ ఖర్చు చేశాడు. బడ్జెట్‌కు, కలెక్షన్స్‌కు ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. ఈ చిత్రం ఇప్పటి వరకు కోటి రూపాయలను వసూళ్లు చేయలేక పోయిందని ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. మొత్తంగా ఒక కోటి వరకు కలెక్షన్స్‌ను సాధించే అవకాశం ఉంది. ఇక ఆన్‌లైన్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ద్వారా మరో కోటి వరకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఆరు కోట్లు పెట్టుబడి పెట్టిన శివబాలాజీకి కేవలం రెండు కోట్లు చేతికి వచ్చే అవకాశం ఉంది. అంటే నాలుగు కోట్ల మేరకు శివబాలాజీ నష్టపోయే అవకాశం ఉంది. ఒక చిన్న చిత్రానికి ఇంత భారీ నష్టం అంటే నిర్మాత నెత్తిన గుడ్డెసుకోవాల్సిందే. మరి శివబాలాజీ మళ్లీ తేరుకుని సినిమాలు నిర్మిస్తాడా దీంతో స్టాప్ చేస్తాడా అనేది చూడాలి.