Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టార్ మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ సీజన్ 1 ముగింపు దశకు చేరుకుంది. సినిమాల్లో క్లైమాక్స్‌లో ఎక్కువ టెన్షన్ పెట్టడంతో పాటు, ఎక్కువగా ఆకట్టుకునేందుకు దర్శకుడు ఎలా అయితే ప్రయత్నిస్తాడో, బిగ్‌బాస్ షో క్లైమాక్స్‌లో కూడా షో నిర్వాహకులు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక నిన్న ప్రసారం అయిన ఎపిసోడ్లో ఇంటి సభ్యుల ఎమోషన్స్‌తో బిగ్‌బాస్ ఒక ఆట ఆడేసుకున్నాడు. వారితో ఆడుకోవడంతో పాటు, ప్రేక్షకులకు కూడా కన్నీరు వచ్చేలా చేశాడు.
బిగ్‌బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఫ్రీజ్ అండ్ అన్‌ఫ్రీజ్ ఆటను బిగ్‌బాస్ మొదలు పెట్టాడు. ఫ్రీజ్ అన్నప్పుడు ఎక్కడి వారు అక్కడే నిల్చుండాలి. ఆట సరదాగా సాగిపోతున్న సమయంలో అందరిని ఫ్రీజ్ చేసి శివబాలాజీ భార్య స్వప్ప మాధురిని ఇంట్లోకి పంపించడం జరిగింది. అంతా షాక్ అయ్యారు. ఆ సమయంలో శివబాలాజీ ఎమోషన్ అయ్యాడు. ఇంట్లో ఎప్పుడు స్ట్రాంగ్‌గా కనిపించిన శివబాలాజీ కూడా ఒకింత ఎమోషన్ అయ్యాడు.
ఆ తర్వాత ఆదర్ష్ భార్య కూడా అదే విధంగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆదర్ష్తో బిగ్‌బాస్ ఆట ఆడుకున్నాడు. నిమిషం కాగానే ఆదర్ష్ భార్యను ఇంట్లోంచి వెళ్లి పోమ్మన్నాడు. ఆ సమయంలో ఆదర్ష్ను ఫ్రీజ్‌లో ఉంచాడు. ఈ పరిణామాలకు ఇంటి సభ్యులు అంతా కూడా కన్నీరు పెట్టారు. ఆ తర్వాత మళ్లీ కన్ఫెషన్ రూంలోకి పిలిచి కొడుకు మరియు భార్యతో బిగ్‌బాస్ కలిపాడు. గత కొన్ని రోజులుగా మూడీగా ఉంటున్న ఆదర్ష్ భార్యను కొడుకును చూడటంతో చాలా సంతోషం అయ్యాడు. ఆదర్ష్ తర్వాత అర్చనకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వడంతో ఎపిసోడ్ పూర్తి అయ్యింది. ఇక నేటి ఎపిసోడ్లో ఎలాంటి సర్ప్రైజ్లు ఉంటాయో చూడాలి. నిన్న ప్రసారం అయిన ఎపిసోడ్ ఈ సీజన్‌కే హైలైట్ అవుతుందని చెప్పుకోవచ్చు.
మరిన్ని వార్తలు: