నూతన్‌ నాయుడు బండారం బట్టబయలు…!

Siva Shocking Comments on Bigg Boss 2 Contestant Nutan Naidu

తెలుగు బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన నూతన్‌ నాయుడు కేవలం రెండు వారాల్లోనే ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే. రాజకీయ నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న నూతన్‌ నాయుడు రెండవ వారంలోనే వెళ్లి పోవడంతో నిరాశ వ్యక్తం చేశాడు. అనుకోని అదృష్టం అన్నట్లుగా నూతన్‌ నాయుడుకి మళ్లీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కింది. భారీ ఎత్తున ప్రమోషన్స్‌ చేసుకోవడంతో నూతన్‌ నాయుడుకు ఓట్లు బాగా వచ్చాయంటూ స్టార్‌ మా వారు చెబుతున్నారు. నూతన్‌ నాయుడు రీ ఎంట్రీపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే సామాజిక కార్యకర్త అయిన శివ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ నూతన్‌పై సంచలన ఆరోపణలు చేయడం జరిగింది.

నూతన్‌ నాయుడు ఒక రాజకీయ బ్రోకర్‌ అని, లాబియింగ్స్‌ చేస్తూ డబ్బులు సంపాదిస్తాడట. ఒక వ్యక్తి వద్ద ప్రైవేట్‌ యూనివర్శిటీకి అనుమతులు ఇప్పిస్తాను అంటూ ఏకంగా మూడు కోట్ల రూపాయలు తీసుకున్నాడట. హీరోయిన్స్‌ను ప్రసన్నం చేసుకునేందుకు, వారితో చనువుగా ఉండేందుకు లక్షలు ఖర్చు చేస్తాడని శివ ఆరోపించాడు. బాలకృష్ణ మరియు నారా భువనేశ్వరిలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, భువనేశ్వరిని భువనక్క అంటూ పిలుస్తాను అంటూ తన వెనుక ఉండే వారికి చెప్పుకుంటూ ఉంటాడు. నూతన్‌ అసలు పేరు నూతన్‌ నాయుడు కాదని, నూతన్‌ కుమార్‌ అయితే మార్చుకున్నాడట. నాయుడు అని ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఇలా మార్చుకున్నాడని శివ అన్నాడు. ఎంతో మంది వద్ద లక్షల్లో కమీషన్స్‌ తీసుకున్న నూతన్‌, కొంత మందికి పనులు కూడా చేసి పెట్టలేదట. అధికార పార్టీ తరపున పోటీ చేసేందుకు నూతన్‌ నాయుడు ఆసక్తి చూపుతున్నాడట. ఎమ్మెల్యే అయితే నూతన్‌ నాయుడు ఇంకా ఎంతగా జనాలను మోసం చేస్తాడని శివ అన్నాడు.