రాహుల్‌కూ హామీ ఇచ్చిన నాగార్జున…?

Nagarjuna gave a green signal to the movie with Rahul Ravindran.

నాగార్జున ఇటీవలే రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో చేసిన ‘ఆఫీసర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘శివ’ రేంజ్‌లో ఊహించుకుంటే ‘ఆఫీసర్‌’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. నాగార్జున ఎందుకు ఈ చిత్రాన్ని చేశాడు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆఫీసర్‌ ఫ్లాప్‌ అయినా కూడా నాగార్జున సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం నానితో కలిసి ‘దేవదాసు’ అనే మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. దసరా కానుకగా దేవదాసు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం తర్వాత నాగార్జున చేయబోతున్న చిత్రా జాబితా చాలానే ఉంది.

Nagarjuna gave a green signal rahul

ఇప్పటికే కళ్యాణ్‌ కృష్ణతో ‘బంగార్రాజు’ చిత్రంకు స్క్రిప్ట్‌ రెడీ చేయిస్తున్నారు. మరో వైపు నాగార్జున తమిళ స్టార్‌ హీరో ధనుష్‌తో కలిసి ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇటీవలే బాలీవుడ్‌లో కూడా నాగార్జున ఒక చిత్రం చేస్తున్నాడు. ఇలా వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్న నాగార్జున తాజాగా రాహుల్‌ రవీంద్రన్‌కు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది. ‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన రాహుల్‌ రవీంద్రన్‌ ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. కాని సక్సెస్‌లను మాత్రం దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు. తాజాగా ‘చి॥ల॥సౌ॥’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. దర్శకుడిగా మొదటి చిత్రంతోనే సక్సెస్‌ను దక్కించుకున్న రాహుల్‌ రవీంద్రన్‌తో సినిమాను చేసేందుకు నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ప్రస్తుతం రాహుల్‌ రవీంద్రన్‌ రెండు స్టోరీలను సిద్దం చేసుకున్నాడట. వాటిల్లోంచి ఒకదాంతో నాగార్జునతో సినిమా చేస్తాడని తెలుస్తోంది.

Rahul Ravindran And Nagarjuan