బంగార్రాజుపై మోజు తగ్గలేదా?

Nagarjuna Interested to act Bangarraju movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నాగార్జున ఇమేజ్‌కు దగ్గరగా ఉండి సూపర్‌ హిట్‌ అయిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన’. ప్రేక్షకులు నాగార్జునను ఎలా చూడాలనుకుంటున్నారో ఆ చిత్రంలో దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణా అలా చూపించాడు. దాంతో ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రంలోని బంగార్రాజు పాత్ర సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ఉండేది కొద్ది సమయమే అయినా కూడా ఆ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అందుకే ఆ పాత్రను బేస్‌ చేసుకుని ఒక చిత్రం చేయాలని నాగార్జున కోరుకున్నాడు. అందుకు కథను సిద్దం చేయాల్సిందిగా దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణకు సూచించాడు. దాదాపు ఆరు నెలలు కూర్చుని రెండు మూడు వర్షన్‌లలో దర్శకుడు కథను సిద్దం చేశాడు. నాగార్జునకు ఆ కథ నచ్చకపోవడంతో దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మరో ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాడు.

ప్రస్తుతం రవితేజతో ‘నేలటికెట్‌’ అనే చిత్రాన్ని కళ్యాణ్‌ తెరకెక్కిస్తున్నాడు. ఆ చిత్రం తర్వాత మరోసారి ‘బంగార్రాజు’ కథపై కూర్చోవాల్సిందిగా నాగార్జున సూచించినట్లుగా తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయన చిత్రం విడుదలై చాలా సంవత్సరాలు అయినా కూడా బంగార్రాజు పాత్రపై నాగార్జునకు మోజు తీరినట్లుగా లేదని, అందుకే ఆ చిత్రాన్ని చేయాలని నాగ్‌ కోరుకుంటున్నాడు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో ‘ఆఫీసర్‌’ అనే చిత్రాన్ని నాగ్‌ చేస్తున్నాడు. ఇదే సమయంలో నానితో కలిసి ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని కూడా నాగార్జున చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత నాగార్జున బంగార్రాజుగా వస్తాడేమో చూడాలి.