ఏయన్నార్‌ ఓకే… మరి ఎన్టీఆర్‌?

Naga Chaitanya to acts ANR role in Mahanati Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పటికి గుర్తుంచుకునే నటి సావిత్రి. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా యువ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. కీర్తి సురేష్‌, సమంత హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌, ప్రకాష్‌ రాజ్‌, విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే ఇంకా పలువురు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ పాత్రలు కొద్ది సమయం కనిపిస్తాయని మొదటి నుండి ప్రచారం జరుగుతూ వస్తుంది. అయితే ఆ ఇద్దరి పాత్రలకు ఎవరు నటిస్తారు అనే విషయంలోనే ఆసక్తి నెలకొంది. మొదట ఆ పాత్రలను గ్రాఫిక్స్‌ ద్వారా క్రియేట్‌ చేయాలని భావించారు. కాని తాజాగా రియల్‌ క్యారెక్టర్స్‌తోనే చేయించాలని నిర్ణయించారు.

‘మహానటి’ చిత్రంలో ఎయన్నార్‌ పాత్రను నాగచైతన్య చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. దాంతో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. నాగచైతన్య మరియు సమంతలు ఒకే సినిమాలో నటించనుండటంతో అంచనాలు ఆకాశానికి తాకేలా వస్తున్నాయి. ఏయన్నార్‌ పాత్రను చేసేందుకు నాగచైతన్య వారం రోజుల డేట్లు కూడా ఇచ్చాడు. ఏయన్నార్‌ పాత్రను నాగచైతన్య చేయబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్‌ పాత్రను చేయబోతున్న హీరో ఎవరు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌ పాత్రను జూనియర్‌ ఎన్టీఆర్‌ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాని ఎన్టీఆర్‌ అందుకు ఒప్పుకునే అవకాశం లేదు. మరో యంగ్‌ హీరోను ఎన్టీఆర్‌ పాత్రకు ఎంపిక చేస్తారేమో చూడాలి.