క్షమించండమ్మా…ఈ చేతకాని, చేవలేని నిర్భాగ్యుడిని !

Yadadri red light gangs issue

నేటి మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు చూస్తుంటే ఏమనాలో కూడా అర్ధం కాని పరిస్థితి. ఇటీవలి కాలంలో
నన్ను నేను చదివిన వార్త ఒకటి నన్ను వెంటాడుతోంది. అదే యాదాద్రి వ్యభిచార కూపాల మీద వచ్చిన వార్త.
అసలు ఏమి జరుగుతోంది ఈ సమాజంలో, మనం జన జీవన శ్రవంతిలోనే ఉన్నామా ? లేక ఏదైనా అడవిలో ఉన్నామా ? ఒక్క అమాయకపు ఆడపిల్లకి ఒక్కసారి అత్యాచారం జరిగితే వాళ్ళ ముఖాల మీద కూడా మైకుల గొట్టాలు పెట్టె మీడియా ఉన్న దౌర్భాగ్య దేశంలో ఉన్నాం.

sexuall harrasment on child

అసలు బతికేది ఎందుకు కడుపు నిండా తినడానికే కదా అలా అని మనం కడుపు నింపుకునేందుకు ఒకరి మీద, అదీ వారి రక్త కన్నీరు జాలువారుతున్న శరీరాలలో అదీ అసలేమీ తెలియని పసి పిల్లలతో ఎలా మనసొప్పింది ఆ కఠినాత్ములకు ? ఆ వార్త సారాంశం ఏంటంటే ఇటీవలి యాదగిరి గుట్టలోని పలు ఇళ్లపై దాడులు నిర్వహించిన పోలీసులు ఇప్పటి వరకూ 15 మంది చిన్నారులను రక్షించారు. వ్యభిచార ఊబిలోకి ఎలా దింపుతారనే విషయమై ఆ పసి మొగ్గలు చెప్పిన వాస్తవాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. సదరు వ్యభిచార ముఠా ఐదు నుంచి ఏడేళ్ల మధ్య వయసున్న చిన్నారులను కొనుగోలు చేసి( వారిని రాష్ట్రంలోని పలు చోట్ల నుండి కిడ్నాప్ చేసి తీసుకొస్తారు) వారికి ముందు బట్టలు ఉతకడం, వంట పని, ఇంటి పని నేర్పి, కొంత వయసు రాగానే వ్యభిచార రొంపిలోకి దింపుతారు.

sexuall-harrasment

వారు చెబుతున్న మాటలు వింటుంటే ఆ పని చేయించిన వారిని ఖండ ఖండాలుగా నరికినా తప్పు లేదు అనిపిస్తుంది. వ్యభిచారంలోకి దింపడానికి ముందే వారు బాలికలను అందుకు మానసికంగా సన్నద్ధం చేస్తారట. పగలంతా ఇంటి పని చేయించి రాత్రి పూట అశ్లీల వీడియోలు చూపిస్తూ ఒక జంట సెక్స్ చేస్తుంటే అదే గదిలో కూర్చోని చూడాలని, ఆ విధంగా పదే పదే ఇలా చేయించడం ద్వారా ‘ఆ’ కార్య ఏమీ అంత తప్పు కాదనే భావనను వారిలో కలిగిస్తున్నారట. ఐదేళ్ల నుండి ఎనిమిదేళ్ళ వయసున్న పసిపాపలు జంటలు శృంగారంలో పాల్గొంటుంటే చూడాల్సి రావడం అనే మాట వింటుంటేనే భయం వేస్తోంది. మన ఇళ్ళలో పిల్లల దగ్గర తప్పుగా ఒక మాట మాట్లాడడానికి భయపడతామే అలాంటిది వారి ముందే ఇలా చేయించడం ఒకవేళ ఒప్పుకోకపోతే వారికి వాతలు పెట్టి మరీ బలవంతంగా చూపించడం అనేది సహించరాని నేరం.

Police-rescued-a-gang-of-gi

కొన్నాళ్ళ క్రితం ఆసిఫా, దాచేపల్లి లో మరో బాలిక ఇలాంటివి విన్నప్పుడు వ్యభిచారాన్ని లీగలైజ్ చేస్తే బాగుణ్ణు ఇలాంటి దారుణాలు కొంత వరకు అయినా ఆగుతాయి అనుకున్న వారిలో నేనొకడిని కానీ ఈ ఘటన విన్నాకా ఒళ్లంతా కంపించింది. అసలు లీగల్ కాకపోతేనే ఇలా ఇంత బరితెగించి పసి పిల్ల మీద ప్రతాపం చూపించి వారి జీవితాలని నాశనం చేస్తోంటే ఇంకా లీగల్ అయ్యుంటే అమ్మో ! ఆ ఊహే భయానకంగా ఉంది. అసలు ఇలాంటి పనులు చేసేవారికి తగిన శిక్షలు ప్రభుత్వం విధిస్తోందా ? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇలాంటి విషయాల్లో ఇస్లాం దేశాలయిన దుబాయి లాంటి దేశాల్ని ఆదర్శవంతంగా తీసుకుంటే అయినా ఈ చర్యలు తప్పుతాయేమో ! చివరికి నాకయితే ఒక్క విషయం అర్ధం అవుతోంది మనుషుల్ని కంట్రోల్ చేయగలగడం కన్నా మనసుల్ని కంట్రోల్ చేసిన నాడు ఇలాంటి పాపాలు జరగడం ఆగుతాయి. ఆ కంట్రోల్ చేయడం వెనుక భయం ఉందా ? భక్తి ఉందా ? అనేది అనవసరం అలా కంట్రోల్ చేయగలిగిన రోజున ఇవన్నీ ఆగుతాయి.

Yadagirigutta-Issue

పీ ఎస్ :

క్షమించండమ్మా, ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి మనుషుల మధ్య మీరు పడుతున్న నరకం ఇంకెవరికీ రాకూడనిది. ఒకరకంగా మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా లేదేమో

క్షమించండమ్మా…ఈ చేతకాని చేవలేని నిర్భాగ్యుడిని, నాలుగు మొక్కలు నాటి గ్రీన్ చాలెంజ్ చేస్తాం, కారు నుండి దిగి కికి చాలెంజ్ చేస్తాం, కానీ మీ బంగారు భవితవ్యానికి భరోసా ఇచ్చే చాలెంజ్ చేసే వాడు రానందుకు క్షమించడమ్మా !