‘దేవదాసు’పై నాగ్‌కు సీక్వెల్‌ అంత నమ్మకం…!

nagarjuna-and-nani-multistarrer-movie-in-devdas

అక్కినేని నాగార్జున హీరోగా ఈమద్య సక్సెస్‌లు దక్కించుకోలేక పోతున్నాడు. ఆ కారణంగానే వరుసా మల్టీస్టారర్‌ చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. నాగార్జున ప్రస్తుతం నానితో కలిసి శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో ‘దేవదాసు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దర్శకుడు శ్రీరామ్‌ ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కిస్తున్నాడు అని, యూత్‌ ఫుల్‌గా చిత్రాన్ని ప్రజెంట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. టైటిల్‌ చూసి ఇదేదో బ్యాడ్‌ క్లైమాక్స్‌ ఉంటుందని ఊహించుకోవద్దని, దేవదాసు టైటిల్‌ను పెట్టడానికి కారణం సినిమాలో తన పేరు దేవ, నాని పేరు దాసు అని, అందుకే టైటిల్‌గా దేవదాసు పెట్టామని నాగార్జున చెప్పుకొచ్చాడు. సినిమా సెప్టెంబర్‌లో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.

అశ్వినీదత్‌ చాలా కాలం తర్వాత చేస్తున్న పెద్ద సినిమా ఇదే అవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సినిమా ఇంకా విడుదల కాకుండానే నాగార్జున ఈ చిత్రంపై అంచనాలు పెంచేందుకు సినిమా సీక్వెల్‌ గురించి ప్రస్థావించాడు. ‘దేవదాసు’ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. అందుకే దేవదాసు సీక్వెల్‌ను కూడా ప్లాన్‌ చేస్తున్నామంటూ ప్రకటించాడు. సీక్వెల్‌లో కూడా నేను మరియు నాని నటిస్తామన్నట్లుగా నాగార్జున చెప్పుకొచ్చాడు. దాంతో దేవదాసు సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దసరా కానుకగా రాబోతున్న ఈ చిత్రం పెద్ద చిత్రాలను ఢీ కొట్టబోతుంది. సినిమాపై భారీ నమ్మకం ఉన్న కారణంగానే అరవింద సమేత వంటి చిత్రానికి పోటీగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. రికార్డు స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తే నాగ్‌ అన్నట్లుగా నిజంగానే సీక్వెల్‌ ఉంటుందేమో చూడాలి.