బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సిద్దిపేట జిల్లా చేర్యాలలో నిరసన సెగ తగిలింది. చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో కాన్వాయిని JAC నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పల్లా గో బ్యాక్, పల్లా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చేర్యాలని వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలోనే నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ కూడా చేశారు.
ఇది ఇలా ఉండగా, నిన్న మొన్నటి వరకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర్ రెడ్డి కి అక్కేస్తే దగ్గు అన్నట్టుగా వాడి వేడి కొనసాగింది. తాజాగా హైదరాబాద్ మహానగరంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఇరువురు ఒకటయ్యారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పల్లా ముత్తిరెడ్డి,మధ్య సయోద్య కుదిరింది. జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కేటీఆర్ సయోద్య కుదిర్చారు .