విశ్వంభర షూట్‌లో ఘనంగా చిరు ఎంట్రీ..!

విశ్వంభర షూట్‌లో ఘనంగా చిరు ఎంట్రీ..!
Cinema News

మెగాస్టార్ చిరంజీవి చివరిసారిగా భోళా శంకర్ సినిమా లో కనిపించారు. ఈ సినిమా ఆడియెన్స్ ని ఏ మాత్రం ఆకట్టుకోలేక డిజాస్టర్ గా నిలిచింది. చిరు నెక్స్ట్ బింబిసార ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట తో ఒక మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. విశ్వంభర గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. తాజాగా స్టార్ట్ అయిన ఈ షెడ్యూల్ లో మెగాస్టార్ చిరంజీవి జనవరి చివరి వారం లో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జాయిన్ కానున్నట్లు తెలుస్తుంది .

విశ్వంభర షూట్‌లో ఘనంగా చిరు ఎంట్రీ..!
Vishwambara

ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీ కి ఆస్కార్ అవార్డు విన్నర్ అయినటువంటి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.