ప్రస్తుతం ఉన్న ఈ మహమ్మారి సమయంలో, గ్యాడ్జెట్స్ మీద మనం ఆధారపడడం ఇంకా ఎక్కువైపోయింది. కంప్యూటర్ ముందే గంటలు గంటలు గడుపుతున్నాం. ఈ మధ్యకాలంలో వచ్చిన ఇంకొక అలవాటేమిటంటే ఫోన్‌ని ఆపకుండా వాడుతూనే ఉండడం. పొద్దున్న నిద్ర లేచి లేవగానే ఫోన్ తీస్తున్నాం, రాత్రి నిద్ర కళ్ళ మీదకి వాలిపోయే వరకూ ఫోన్‌తోనే ఉంటున్నాం. ఎక్కడికీ వెళ్ళే వీలూ, ఎవరిని కలిసే వీలూ లేకపోవడంతో సోషల్ అప్‌డేట్స్ కోసం ఫోన్ మీదే ఆధారపడుతున్నాం.
స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేయడం హెల్త్‌కి మంచిది కాదని తెలిసిన విషయమే. అయితే, ఈ వాడకం స్కిన్ హెల్త్‌కి కూడా మంచిది కాదని మీకు తెలుసా? ఎక్కువ సేపు ఫోన్ వాడడం వల్ల తలనొప్పి, మెడనొప్పి, ఐసైట్ ప్రాబ్లమ్స్ వంటివే కాక యాక్నే, ముడతలు వంటి చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. స్కిన్‌కి సంబంధించిన ఆ సమస్యలేమిటో చూడండి.
డెర్మటైటిస్
మీరు మీ చేతుల మీద, మీ ఫేస్ మీద డ్రైగా అయిపోయి, దురద పెడుతున్న ప్యాచెస్‌ని గమనించారా? అది మొబైల్ రేడియేషన్ వల్ల కావొచ్చు. మొబైల్ రేడియేషన్ అప్పటికే కొన్ని ఎలర్జీలతో సఫర్ అవుతున్న వారిలో యాంటిగెన్స్‌ని పెంచుతుంది. దీనికి మరో కారణం ఏంటంటే, ఫోన్‌లో వాడే నికెల్, కోబాల్ట్. ఈ మెటల్స్ రేడియేషన్‌తో కలిసి మీ స్కిన్‌ని ఎర్రగా, దురద ఉండేలా చేస్తాయి.
క్రోస్ ఫీట్
రాత్రి లైట్ తీసేసిన తరువాత కూడా కొంతమంది సెల్ ఫోన్స్‌లో చాట్ చేస్తూ ఉంటారు, లేదా ఏవైనా వీడియోలు చూస్తూ ఉంటారు. సరైన లైటింగ్ లేదు కాబట్టి, చిన్న ఫాంట్ చూస్తారు కాబట్టి స్క్వింట్ చేసి చూడవలసి వస్తుంది. నెమ్మదిగా కళ్ళ చుట్టూతా ముడతలు వచ్చేస్తాయి. మీ ఫోన్‌లోనే మీరు ఎక్కువ వర్క్ చేసుకునేట్లైతే ఫాంట్స్ పెద్దగా ఉంచుకోండి.
వేడి
చాలాసేపు మాట్లాడిన తరువాత ఫోన్ వేడిగా అయిపోతుంది, గమనించారా? ఇలా జరగడం వల్ల స్కిన్ లో మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువయిపోతుంది. ఇందువల్ల స్కిన్ టోన్ అన్ఈవెన్‌గా మారుతుంది. ఫేస్ అంతా డార్క్ స్పాట్స్ వస్తాయి. వీలున్నంత వరకూ హ్యాండ్స్ ఫ్రీ ఆప్షన్ యూజ్ చేస్తే ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చు.
యాక్నే
టీనేజ్ అయిపోయిన తరువాత కూడా యాక్నేతో డీల్ చేయవలసి వస్తుందని ఎవ్వరం అనుకోం. సెల్ ఫోన్స్ రకరకాల జెర్మ్స్‌ని క్యారీ చేస్తాయి. అవన్నీ మీ స్కిన్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అందుకే, మీ ఫోన్‌ని రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూ ఉండండి, కవర్‌లో ఉంచండి, క్లీన్ హ్యాండ్స్‌తో యూజ్ చేయండి.
మెడ మీద ముడతలు
నోటిఫికేషన్ చెక్ చేయడానికో, కొత్త మెయిల్ చూడడానికో, ఫోన్ గ్యాలరీని క్లియర్ చేయడానికో ఫోన్ వైపు చూస్తూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల మెడ మీద ముడతలు ఏర్పడతాయి. దీనికి పరిష్కార మార్గం ఒక్కటే, ఫోన్‌ని పైకెత్తి పట్టుకుని మీ ఐ లెవెల్‌లో పెట్టుకుని చూడడమే.
బ్లూ లైట్
యూవీఏ, యూవీబీ లైట్‌తో పోలిస్తే బ్లూ లైట్ స్కిన్‌కి ఇంకా లోపలికి చొచ్చుకుపోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే మూడు గంటలు సెల్ ఫోన్‌లో మాట్లాడారంటే అర్ధగంట సేపు ఎలాంటి సన్ ప్రొటెక్షన్ లేకుండా ఎండలో గడిపినట్లు. ఇందువల్ల స్కిన్ ట్యాన్‌తో పాటు ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. దీన్ని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఫోన్‌ని కంటిన్యువస్‌గా యూజ్ చేయకుండా ఉండడమే. ఫోన్ బ్రైట్‌నెస్ తగ్గించుకోవచ్చు. డార్క్ మోడ్‌లో యూజ్ చేయవచ్చు.
ఇవి స్కిన్ మీద ఫోన్ చూపించే ప్రభావం అయితే బాడీ మీద చూపించే ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మొబైల్ ఫోన్స్ ఎలెక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్‌ని వెలువరిస్తాయి. కాల్స్ చేయడానికి ఇది అవసరం. ఈ రేడియేషన్ లో పవర్, షార్ట్ రేంజ్‌లోనే ఉంటుంది కానీ, లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ వల్ల కొన్ని హానికారక ప్రభావాలు ఉండే అవకాశముంది. అవేమిటంటే:
- సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ పెరిగే అవకాశముంది.
- ఫోన్‌లో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ వలన బ్రెయిన్ టెంపరేచర్ పెరగవచ్చు.
- సెల్ ఫోన్‌ని చాలా ఎక్కువ సేపు రెగ్యులర్‌గా వాడేవారికి కొన్ని రకాల కాన్సర్లు వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.
మరి ఏం చేయాలి..
మొబైల్ టెక్నాలజీ వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అది లేకుండా కుదరదు. కాబట్టి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు మనని చాలా వాటి నుండి ప్రొటెక్ట్ చేస్తాయి. ఆ జాగ్రత్తలు ఏమిటంటే:
- ఫోన్ ని మీ శరీరం నుండి దూరంగా పెట్టుకోండి. ఇయర్ ఫోన్స్, లేదా హెడ్ సెట్స్ యూజ్ చేయండి. మీ ఫోన్‌ని ఎప్పుడూ మీ పాకెట్‌లోనే పెట్టుకునే అలవాటుకి స్వస్తి చెప్పండి.
- మీరు నిద్రపోతున్నప్పుడు రేడియేషన్ తగ్గించడానికి మీ సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయండి. మీ ఫోన్‌లో అలారం, లేదా ఫ్లాష్ లైట్ యూజ్ చేయవలసిన అవసరం మీకుంటే కనీసం ఫ్లైట్ మోడ్ లోకి మార్చుకోండి. ఫోన్ ని మీ దిండు కిందా, మీ తలకి దగ్గరగానో పెట్టుకోవడం పూర్తిగా మానేయండి. బెడ్‌సైడ్ టేబుల్ మీద ఫోన్ పెట్టుకునే అలవాటు చేసుకోండి.
- చాలా సేపు ఫోన్ లో మాట్లాడడం తగ్గించండి. మెసేజెస్ వాడడం అలవాటు చేసుకోండి. ప్రస్తుతం మెసేజింగ్ యాప్స్ విరివిగా లభిస్తున్నాయి, కాబట్టి ఇదొక ప్రాబ్లం కాకపోవచ్చు.
- కార్లు, బస్సులు, రైళ్ళు, లిఫ్టులు వంటి ఎన్‌క్లోజ్డ్ స్పేసెస్‌లో మొబైల్ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ ప్రదేశాల్లో సెల్ ఫోన్ వాడకం వీలున్నంతగా తగ్గించండి.
- సిగ్నల్ వీక్‌గా ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేయకండి. ఎందుకంటే ఇలాంటప్పుడు ఎలెక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది.
- మీ పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇవ్వకండి, ఇచ్చినా స్క్రీన్ టైంని కంట్రోల్ చేయండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.