సిగరెట్ తీపి ప్రాణం తీసింది

మహారాష్ట్ర ఎపిఎంసి మార్కెట్ సమీపంలో సిగరెట్ ఇవ్వడానికి నిరాకరించినందుకుగాను 38 ఏళ్ల వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు పొడిచి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన విషయంలో… నిందితులపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇద్దరు నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే అసలు సిగరెట్ల కొరత నేరానికి కారణమైందా?అనే అనుమానం కలుగుతుంది. కాగా బాధితుడు ఎపిఎంసి మార్కెట్‌లో కూరగాయల వ్యాపారి అరవింద్ శంకర్ కుమార్ గా గుర్తించారు. అతడు ఉత్తరప్రదేశ్ కు చెందినవాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత పాన్ షాపులు, పొగాకు ఉత్పత్తులను విక్రయించే అవుట్ లెట్లు మూసివేయడంతో సిగరెట్ల కొరత ఏర్పడింది. ఈ నేరానికి ఇదే ముఖ్య కారణంగా తెలుస్తోంది అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన బంధువుతో కల్యాణ్ లోని గోవింద్ వాడి ప్రాంతంలో నివసిస్తున్నాడు.

అయితే అరవింద్ ఎపిఎంసి మార్కెట్‌లోని టాయిలెట్ వద్ద ధూమపానం చేస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు అతన్ని చూసి వారికి సిగరెట్ ఇవ్వమని అభ్యర్థించారు. అరవింద్ వారి అభ్యర్థనను తిరస్కరించడంతో ఇద్దరు వ్యక్తులు విరుచుకుపడ్డారు. వారు అతనిని స్క్రూడ్రైవర్‌తో కడుపు, ఛాతీలో పలుసార్లు పొడిచి చంపినట్లు తెలుస్తోంది. కాగా వెంటనే బాధితుడిని కల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రికి తరలించి.. ఆ తర్వాత చికిత్స కోసం ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించినట్లు గుప్తా తెలిపారు. ఇద్దరు హంతకులు చేసిన తీవ్రమైన గాయాలకు ఒక వ్యకి తన ప్రాణాలను కోల్పోయాడు.