బద్ధ శతృత్వం వీడి.. కలగలిసి పాముపై కప్ప సవారీ..

సృష్టిలో అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. సహజంగా పాము, కప్పు బద్ధ శత్రులన్న విషయం తెలిసిందే. దీంతో కప్పు కనిపిస్తే చాలా పాము అమాతం వెంటాడి తినేస్తుంటుంది. అస్సలు విడిచి పెట్టదు. మింగేసి తినేస్తుంది. దీనిపై సామెత కూడా ఉంది. విడవమంటే కప్పకు కోపం పట్టుకోమంటే పాముకు కోపం అని. ఈ సామెతలు ఊరికే రాలేదు.

అయితే.. ఈ బద్ద శత్రువులైన ఈ రెండు కలిసి ఉండటం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా? అలాంటివే అరుదుగా దర్శనమిస్తాయి. తాజాగా వీటి ధర్మానికి విరుద్ధంగా పాము, కప్ప రెండు కలిసి మెలిసి తిరుగుతున్నాయి. అంతేకాదు.. పాము పై కప్ప సవారీ కూడా చేసింది. అందుకు సంబంధించిన చిన్న వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరూ చూడండి.