కాంగ్రెస్ లో అన్ ఫాలో గుబులు

Social Media War in Congress Party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కాంగ్రెస్ ఇంకా దశాబ్దాల కాలం నాటి సిద్ధాంతాలను పట్టుకుని వేళ్లాడుతోంది. ప్రచారంలో కూడా అప్ డేట్ కావడం లేదు. కానీ బీజేపీ సోషల్ మీడియా ప్రచారంలో అందనంత ఎత్తులో ఉంది. అందుకే కాంగ్రెస్ సీనియర్లు చాలా మంది రాహుల్ తో లాభం లేదని కమలం వైపు చూస్తున్నారు. గుజరాత్ బీజేపీ సీనియర్ నేత వాఘేలా పార్టీ మారే నెలల ముందుగానే రాహుల్ పేజీని అన్ ఫాలో కొట్టారు. అంటే పార్టీ మారేముందే సిగ్నల్ ఇస్తున్నారన్న మాట.

ఇప్పుడీ అన్ ఫాలో దుమారం కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. పార్టీ సీనియర్ నేత, ప్రముఖ లాయర్ కపిల్ సిబాల్ రాహుల్, కాంగ్రెస్ అఫిషియల్ పేజ్ అన్ ఫాలో కొట్టడంలో శ్రేణుల్లో కలకలం మొదలైంది. అసలేమైందంటూ కపిల్ సిబాల్ కు ఫోన్ల మీద ఫోన్లు వెళ్లాయి. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ఆయన కూడా పార్టీ మారుస్తారేమోనని సోనియా కూడా టెన్షన్ పడ్డారట. కానీ అది సిబ్బంది పొరపాటని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

చివరకు మాజీ హోం మంత్రి చిదంబరం కూడా అన్ ఫాలో కొట్టారని ప్రచారం జరిగింది. అదీ ఫేక్ అని తేలడంతో ఏఐసీసీ ఊపిరి పీల్చుకుంది. ఇలా అయితే లాభం లేదని సోషల్ మీడియా కోసం ఓ టీమ్ ఏర్పాటు చేసినా.. అది ఏమాత్రం వర్కవుట్ కాలేదు. మరి కాంగ్రెస్ పునరుత్థానం ఎలా సాధ్యం, ఎవరు సాధిస్తారనేది పార్టీ శ్రేణులకు అంతుబట్టడం లేదు.

మరిన్ని వార్తలు: