ముందస్తు బాంబు పేల్చిన బాబు

Speech at Nandyala Elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

నంద్యాలలో రెండురోజులే ఉన్నా తనదైన శైలిలో సూపర్ స్పీచులతో అదరగొట్టిన ఏపీ సీఎం చంద్రబాబు ముందస్తు ఎన్నికల పేరు చెప్పి ప్రత్యర్థుల్ని అయోమయంలో పడేశారు. ప్రసంగాల్లో నవరసాలు ఉండేలా జాగ్రత్తపడ్డ బాబు.. మోడీ తలుచుకుంటే ఎప్పుడైనా ఎన్నికలు వస్తాయని చెప్పేశారు. దీంతో వైసీపీకి టెన్షన్ మొదలైంది. నంద్యాలలో అటూఇటూగా ఉన్న సమయంలో.. వెంటనే ఏడాదిలో ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తే పుట్టి మునుగుతుందని భయపడుతున్నారు నేతలు.

కానీ చంద్రబాబు యథాలాపంగా అన్న మాటల్ని వక్రీకరిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఆరు నెలలు అటూ ఇటూ అయితే కొంప మునిగేదేమీ లేదని చెబుతున్నారు. చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగానే ఈ మాటలన్నారు. ముఖ్యంగా ఏడాదిన్నర సమయం కోసం కనికరం లేకుండా తండ్రి లేని బిడ్డలపై జగన్ పోటీ పెట్టారనే విషయం బాబు సక్సెస్ ఫుల్ గా జనంలోకి తీసుకెళ్లగలిగారు.

జగన్ దూకుడు ప్రచారంలో కట్టుతప్పి బాబుపై తిట్ల వర్షం కురిపించినా.. చంద్రబాబు మాత్రం సుతిమెత్తగానే విమర్శల్ని తిప్పికొట్టడం ఆయన అనుభవానికి అద్దం పట్టింది. జగన్ లాంటి వాళ్లను బాబు చాలా మందిని చూశారని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు ప్రచారంలో స్ట్రెస్ చేసిన పాయింట్లు సూటిగా ఓటర్ల మనసుల్ని తాకాయంటున్నారు వాళ్లు. మరి మెజార్టీ ఎంతొస్తుందో చూడాలంటున్నారు నేతలు.

మరిన్ని వార్తలు: