సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం​

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం​

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నాగోల్ క్రాస్‌ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ లారీ వినయ్‌ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బైక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

అల్కాపురి నుంచి పటేల్‌ నగర్‌కి వెళ్తుండగా లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.ఢీకొట్టినలారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.