ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే… తన కూతురిని అమ్మకానికి పెట్టేశాడు.ఈ ఘోరమైన వినకూడని ఘటన చిత్తూరు జిల్లా ప్రజలకు షాక్ కి గురిచేసింది. అసలేం జరిగింది అంటే.. జిల్లాలోని పెద్దపంజాణి మండలం ముదరంపల్లికు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి.. పందులు పెంచుతూ జీవితాన్ని గడుపుతుంటాడు. అతడికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే… వీరిలో ఇద్దరికి పెళ్లిళ్లు చేశాడు. బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లికి చెందిన సురేష్ గతంలో వెంకటరమణ పెద్ద కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అది కుదరక పోవడంతో.. రెండో కుమార్తెను ఇవ్వమని కోరాడు. ఆమెకు కూడా పెళ్లి చేసేయడంతో ఇక మూడో కూతురుపై కన్నుపడింది. 12 ఏళ్ల మూడో కూతురుపై కన్నేసిన ఆయన తనకి ఇచ్చి పెళ్లి చేయాలనీ… అందుకోసం రూ.50 వేలు ఎదురు కట్నంగా ఇస్తానని ఎరేశాడు. దీంతో.. రహస్యంగా.. పెళ్ళిచేయడానికి తండ్రి ఒప్పేసుకున్నాడు.