ఈ రోజుల్లో, స్మార్ట్ ఫోన్ జీవితంలో ఒక ప్రధాన భాగమైపోయింది. ఫోన్ లేకుండా ఒక రోజును గడపటం చాలా కష్టం. వాస్తవానికి, ఫోన్ల వాడకం వలన మనకు హానికలిగించే రేడియషన్ ప్రభావం మనకు పొంచి ఉంటుంది. సరైన పద్దతిలో ఫోన్ను వాడడం వలన దీన్నీచాల వరకు తగ్గించవచ్చు. ఈ క్రింద ఇచ్చిన మార్గాలను పాటించడం ద్వారా కొంత వరకు మీతో పాటుగా మీ చుట్టూఉండే వారిని ఫోన్ వెదచల్లే రేడియేషన్ భారి నుండి రక్షించవచ్చు.
- వీలైనంత వరకు కాలింగ్ కి బదులుగా టెక్స్ట్ సందేశాలను పంపడం, లేదా ఫోన్ నుండి కాల్స్ చేయాల్సివచ్చినపుడు బ్లూటూత్ హెడ్ సెట్ లేదా, ఇయర్ ఫోన్స్ వాడడం ద్వారా చాలా వరకు రేడియేషన్ నుండి తప్పిచుకోవచ్చు.
- మీకు అవసంరంలేని సమయంలో వీలైనంత వరకు ఫోనుకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.
- రాత్రి సమయంలో ఫోన్ ఆఫ్ చేయండి ,ఎందుకంటే మీరు ఫోన్ మీ తల దగ్గర పెట్టి పడుకుంటారు అప్పుడు అత్యధికమైన రేడియేషన్ మీరు అందుకుంటారు. ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లో వున్న సరే దానిలోని యాంటెన్నా మరియు బ్యాటరీ రేడియేషన్ ఇస్తాయి కాబట్టి ఫోన్ ఆఫ్ చెయ్యడమే సరైన పరిష్కారం
- సిగ్నల్ సరిగ్గా లేనపుడు ఫోన్ వాడకం తగ్గించాలి.ఎందుకంటే, సిగ్నల్ వీక్ గా ఉన్నపుడూ మన ఫోన్ లోనీ యాంటెన్నాసిగ్నల్ కోసం అత్యదికంగా తరంగాలను విడుదల చేస్తుంది.
- ఫోన్ జేబులో లేదా పౌచ్ తో పాటుగా ఎల్లపుడు మీతోనే అంటిపెట్టుకుని ఉంచుకోవడాన్నితగ్గించండి. ఇలా మీతో పాటుగా ఎల్లప్పుడు ఫోన్ పీటుకోవడం ద్వారా మీకు రేడియేషన్ ప్రభావం ఉంటుంది.