పీసీసీ అధ్యక్షుడు సోమెన్‌ మిత్ర మృతి

పీసీసీ అధ్యక్షుడు సోమెన్‌ మిత్ర మృతి

బెంగాల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ( పీసీసీ) అధ్యక్షుడు సోమెన్‌ మిత్ర(78) గురువారం మృతి చెందారు. 1972-2006 వరకు ఆయన ఎమ్మెల్యేగా పని చేశారు. పశ్చిమ బెంగాల్‌ యూత్‌ కాంగ్రెస్‌ ఆయన మరణించినట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. కిడ్ని, గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న మిత్రను కోల్‌కతా ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన జూలై 30వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటలకు గుండె నొప్పితో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. మిత్రకు కరోనా టెస్ట్‌ చేయగా నెగిటివ్‌ వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు.

మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్న మిత్ర ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆమె ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషించారు. ఆయన తన భార్య, కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మిత్ర మరణవార్తను ఆయన కుటుంబం అధికారికంగా ప్రకటించలేదు. సోమెన్‌ మిత్ర మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.