కెనడాలో మృతి చెందిన తెలుగు యువకుడు

కెనడాలో మృతి చెందిన తెలుగు యువకుడు

కెనడాలో మృతి చెందిన తెలుగు యువకుడు తేజారెడ్డి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. 2018లో చదువు నిమిత్తం కెనడాకు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తేజారెడ్డి.. నిన్న ప్రమాదవశాత్తు కెనడాలో మరణించారు.

మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడం కోసం రూ.5 లక్షలు చందాలు వేసుకుని మృతదేహాన్ని పంపించాలని స్నేహితులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కెనడా హాస్పటల్ మార్చురీలో యువకుడి మృతదేహాన్ని భద్రపరిచారు. కెనడా ప్రభుత్వంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంప్రదించి తేజా రెడ్డి మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించాలని స్నేహితులు కోరుతున్నారు.