Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమరావతిలో అసెంబ్లీ భవనం కొద్దిపాటి వానకే కురిసిందంటూ సాక్షి,వైసీపీ చేస్తున్న ప్రచారం వెనుక కుట్ర దాగి ఉందా? ఏమో..ఆ విషయం తెలియకముందు అసెంబ్లీ లో వర్షపు నీరు ఎలా వచ్చిందా అని సీఎం చంద్రబాబు crda కమిషనర్ శ్రీధర్ ని పిలిచి ఆరా తీశారు.ఇటీవలే కట్టిన భవనాలు ఇంత నాసిరకంగా ఉన్నాయా అని అడిగి పూర్తి సమాచారం అందించాలని ఆదేశించారు.
అటు స్పీకర్ కోడెల కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగే టైం లో పెద్ద వాన కురిసినా రాని నీళ్లు ఇప్పుడు రావడం మీద సందేహం వ్యక్తం చేయడమే కాకుండా cid విచారణకు ఆదేశించారు. cid అధికారుల పరిశీలనలో ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ పై వున్న రైన్ వాటర్ పైప్ ని కట్ చేసినట్టు గుర్తించారు.దీంతో దీని వెనుక విద్రోహ చర్య ఉందని తేల్చారు.ఆ కుట్రలో ఎవరికి భాగస్వామ్యం వుందో తేల్చే పనిలో వున్నారు.cid అధికారులకి ఎవరైనా తప్పు చేసి దొరికితే మాత్రం ఆ పాపం వైసీపీ మీద పడుతుందనడంలో అనుమానం లేదు.
ఈ విషయం తెలియగానే టీడీపీ నేతలు వైసీపీ మీద మండిపడుతున్నారు. అమరావతి కలల్ని ఛిద్రం చేయడానికి వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు.ఓ తెలుగు దేశం కార్యకర్త ఇందుకు సంబంధించి రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్ చెల్ చేస్తోంది..ఆ లేఖ మీకోసం ..
ఇదీ సంగతి.
పైపు లైనులు కోశారు.
కోసిన పైపుల్లో నుంచి నీళ్లు వచ్చి ఆఫీస్ తడిచింది.
L&T కట్టిన నిర్మాణాలలో లోపాలు ఏంటా అనుకున్నాం.
చివరికి తేలింది ” విద్రోహ చర్య ” అని.
ఆరు లక్షల అడుగుల నిర్మాణంలో ఎక్కడా చిన్న లోపం లేనప్పుడు మీకిచ్చిన ఆఫీసులోనే నీళ్లు వచ్చినయ్యి అంటే కనీస అనుమానం రాకుండా ఉంటది అని ఎలా అనుకున్నారు .
అమరావతి మన ఆంధ్రా ప్రజలందరిది… చంద్రబాబు రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ అమరావతి ఎప్పటికీ ఉంటుంది. మన భవిష్యత్తు తరాల కోసం మనం మన అమరావతిని నిర్మించుకుంటున్నాం. అసలు అమరావతి అంటేనే నాశనం లేనిది అని అర్థం. ఈ భ్రమరావతి అనే బ్యాచ్ అంతా భ్రమల్లో మాత్రమే బ్రతికే బ్యాచ్. వాళ్ళకు ఎప్పుడూ నాశనమే కావాలి… విమర్శ, అందునా సద్విమర్శ చేసే మానిసిక పరిపక్వత లేక, కడుపులో ఒక ప్రాంతం మీద రగులుతున్న పైత్యాన్ని అలా దించుకుంటున్నారు. ఆ పైశాచిక ఆనందంలో కోట్ల మంది ఆకాంక్షలని, మనోభావాల్ని దెబ్బ తీస్తున్నాము అని మరిచిపోతున్నారు.ఇప్పటికైనా మారండి, లేదంటే అమరావతికి 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతన్నలు, మీ కోసం ఇంకో ఆరడుగులు సిద్ధం చెయ్యగలరు
– రావిపాటి సాయి కృష్ణ , తెలుగుయువత, గుంటూరు