రాజీనామా చేసిన ఏపీ మంత్రి…అందుకే ?

Somireddy Resigns With CBNs Instructions

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి నిన్న రాజీనామా చేశారు. నిన్న అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజవర్గం నుంచి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ తరపున బరిలోకి దిగుతున్నారు. అందుకే ఎన్నికలకు ముందే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. సోమిరెడ్డి 2016లో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం 2022 వరకు ఉండగా ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఎమ్మెల్సీ పదవి అడ్డుకాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారని చేబుతున్నారు. ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యే పదవి కోరుకోవడం తనకు కరెక్ట్ కాదనిపించిందని ఎమ్మెల్సీగా తనకు 25 నెలల సమయం ఉందని మరొకరికికి అవకాశం ఇవ్వొచ్చని రాజీనామా చేయాలనుకుని తన నిర్ణయాన్ని చంద్రబాబుకు చెప్పానని వెంటనే రాజీనామా ఆమోదం పొందేలా చూడాలని కోరానని ఆయన చెప్పుకొచ్చారు. 2004 నుంచి సర్వేపల్లిలో పోటీ చేస్తున్న సోమిరెడ్డికి వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. దీంతో ఈసారి ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవాలని భావిస్తున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గం మేఎద పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. ఓవైపు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ సర్వేపల్లిలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక మరోపక్క అలాగే తన కుమారుడ్ని కూడా రంగంలోకి దింపి కేడర్‌ను ఎప్పటికప్పుడు ఉత్సాహ పరుస్తున్నారు.